శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' .. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ బిజీగా వున్నాడు. తాజాగా ఒక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ 'భారతీయుడు 2' గురించి ప్రస్తావించారు. "భారతీయుడు 2'లో 'సేనాపతి' పాత్రకి గాను కమలహాసన్ పై టెస్ట్ షూట్ చేసి, ఆయన లుక్ ను సెట్ చేశాము.

పాతిక సంవత్సరాల క్రితం 'భారతీయుడు'లో కమల్ ఎలా కనిపించారో .. ఈ సినిమాలోను ఆయన అలాగే కనిపించనున్నారు. కమల్ ఎనర్జీ .. ఆయన ఫిట్ నెస్ చూసి నేను ఆశ్చర్యపోయాను. 'భారతీయుడు'లో ఆనాటి సమస్యలు చర్చించినట్టే, 'భారతీయుడు 2'లో ఈనాటి సమస్యలు చర్చించడం జరుగుతుంది. '2.ఓ' విడుదలైన కొన్ని రోజుల్లోనే 'భారతీయుడు 2' కి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి" అని స్పష్టం చేశాడు.

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

యూఎస్ రిలీజ్: బాహుబలి ని కొట్టేసిన 2.0!