Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ ఖాన్ ఇంటిపై కన్నేసిన సల్మాన్ ఖాన్, ఎలా మిస్ అయ్యిందంటే...?

షారుఖ్ ఇంటిపై మోజు పడ్డాడంట సల్మాన్ ఖాన్. అవును షారుఖ్ ఇంటిని తన సొంత చేసుకోవాలి అనుకున్నాడట. మరి ఆ ప్రయత్నం ఏమైంది. అసలు షారుఖ్ ఇల్లంటే ఎందుకంత క్రేజ్. 

salman Khan wants to shahrukh khan house
Author
Hyderabad, First Published Aug 5, 2022, 11:19 AM IST

స్టార్ హీరోల ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. సెలబ్రిటీలు ఇళ్ళ కోసం ఏ రకంగా ఖర్చు చేస్తారో అందరికి తెలిసిందే.. బాలీవుడ్ లో తారలు తమ ఇంటి కోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. అందులో బాలీవుడ్ బాద్ షా..షారుక్ ఇల్లంటే ఓ క్రేజ్ ఉంది ముంబయ్ లో. ఈ ఇంటికి సంబంధించిన న్యూస్ ఒకటి నెటింట్లో హల్ చల్ చేస్తోంది. 

ముంబయిలోని షారుఖ్‌ఖాన్‌ లగ్జరీ హోమ్.. మన్నత్‌. ఈ ఇంటికి  ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సముద్రానికి ఎదురుగా.. ఎన్నో ప్రకృతి అందాలు అభిముఖంగా ఉన్న...  సకల విలాసాల కూడిక ఈ నివాస భవనం. ఇక షారుఖ్ ఖాన్ ఇల్లు  ముంబయిలోని ఖరీదైన నివాసాల్లో ఒకటి.  చాలా సంవత్సరాల క్రితమే ఈ ఇంటిని షారుఖ్‌ఖాన్‌ చాలా కాస్ట్ పెట్టి కొనుగోలుచేశారు. అంతే కాదు ఆరు అంతస్తుల ఈబంగ్లాకు షారుఖ్‌ఖాన్‌ భార్య గౌరీఖాన్‌ దాదాపు రెండువందల కోట్లతో ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేయించింది.

ఇప్పుడు విషయం ఏంటీ అంటే.. బాలీవుడ్ స్టార్ హీరో.. షారుఖ్ దోస్త్.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఇంటిపై కన్నేశాడట. తన స్నేహితుడు ఇంటిపై ఆయన కన్నేయడం ఏంటీ అని మీకు డౌట్ రావచ్చు... కాని ఈ ఇల్లు షారుఖ్ ఖాన్ కొనడానికంటే ముందు సల్మాన్‌ఖాన్‌ తీసుకోవాలనుకున్నారట. ఒక్కడికే అంత పెద్ద ఇల్లు ఎందుకని సల్మాన్ ఖాన్ తండ్రి వద్దని అనడంతో  ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట.

ఇక ఈ విషయాన్ని రీసెంట్ గా  ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న తొలి రోజులవి. సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఆ బంగ్లాను చూస్తే ముచ్చటేసేది. ఆ ఇల్లు ఎలాగైనా కొనాలి అని అనుకునేవాడిని. సరిగ్గా అది అమ్మకానికి పెట్టినప్పుడు మొదట ఆ ఇంటిని కొనమని నా దగ్గరకే వచ్చారు. కొనడానికి అన్ని రెడీ చేసుకుంటున్నటైమ్ లోనే నాన్న వద్దని సలహా ఇచ్చారు దాంతో నా ప్రయత్నం విరమించుకున్నాను అన్నారు సల్మాన్ ఖాన్ . 

అయితే తను మిస్ అయినా సరే.. తన స్నేహితుడు ఆ ఇంటిని దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు సల్మాన్. ఇక  షారుఖ్‌ఖాన్‌ ఇల్లు అంటేనే స్పెషల్. అత్యంత ఖరీదైన ఈ ఇంటి చుట్టు ఎప్పుడు సందడిగా ఉంటుంది. షారుక్ అభిమానుల సందడితో మన్నత్‌ పరిసరాలు ఎప్పుడూ బిజీగా కనిపిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios