జగిత్యాలలో ఇద్దరు మైనర్ అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించారు. తమ ప్రేమ విఫలమవుతుందని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఆ సినిమాలో పిల్లా రా పాటను మహేందర్ పదే పదే చూసేవాడని ఆ సినిమాలో హీరోలా తాను కూడా చనిపోతానని మహేందర్ తన మిత్రులతో చెప్పేవాడని పోలీసుల విచారణలో తెలిసింది.

దీంతో దీంతో అన్ని పేపర్లలో, సోషల్ మీడియాలలో 'Rx100' ప్రభావంతో ఆత్మహత్యలు అంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తమ సినిమా పెద్దల కోసమని 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వారి కోసం సినిమా చేయలేదని అన్నారు. ఇప్పుడు సినిమా హీరో కార్తికేయ కూడా ఈ విషయంపై స్పందించారు.

''మా సినిమాను విలన్ గా చూపించడం సరికాదు. పిల్లా రా పాటలో హీరో సూసైడ్ చేసుకోడు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆ పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ సినిమాలో హీరో ఎక్కడా సూసైడ్ చేసుకోడు. హీరోయిన్ క్యారెక్టర్ హీరోని చంపిస్తుంది. చాలా సినిమాలలో రకరకాల పాత్రలు ఉంటాయి. సినిమాను సినిమాగా చూడాలి.

సినిమాలో నెగెటివ్ అంశాలను ఫాలో అవ్వాలని ఏ నటుడు చెప్పడు. ఒకవేళ కొందరు పిల్లలు నెగెటివ్ గా ప్రభావితం అవుతున్నారంటే వాళ్ల మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇటువంటి బాధాకరమైన ఘటనలు జరిగినప్పుడు కేవలం ఆర్టిస్టులను, దర్శకులను టెర్రరిస్ట్ లాగా చూడటం కరెక్ట్ కాదు'' అని అన్నారు. 

సంబంధిత వార్తలు..

జగిత్యాల ప్రేమదేశం కథ: 'Rx100' డైరెక్టర్ ఏమన్నాడంటే!

జగిత్యాల ప్రేమ దేశం కథ: అక్కా చెల్లెళ్లతో వన్‌సైడ్ లవ్, భయంతోనే....

జగిత్యాల ప్రేమదేశం కథ: ఇద్దరమ్మాయిలతో చాటింగ్, ప్లాన్‌తోనే ఆత్మహత్యలు

జగిత్యాల ప్రేమ దేశం కథలో ట్విస్ట్: ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్

జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

ప్రేమదేశం సినిమా తరహాలో ఒక అమ్మాయి కోసం... (వీడియో)

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు