జగిత్యాలలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమించడంతో ఆమె ఎవరినీ పట్టించుకోవడం లేదనే కోపంతో ఇద్దరు స్నేహితులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.

దీంతో ఇద్దరూ కూడా మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఆత్మహత్యల వెనుక 'Rx100' సినిమా ప్రభావం ఉందని విచారణలో తేలింది. ఆ సినిమాలో హీరోలానే తాము కుడా సూసైడ్ చేసుకోవాలని ఇద్దరు విద్యార్ధులు ప్రయత్నించారని పోలీసులు నిర్ధారణకి వచ్చారు. దీంతో అన్ని పేపర్లలో, సోషల్ మీడియాలలో 'Rx100' ప్రభావంతో ఆత్మహత్యలు అంటూ వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన 'Rx100'దర్శకుడు అజయ్ భూపతి.. ''చనిపోయిన ఇద్దరు విద్యార్ధులకు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు. నేను తీసిన సినిమా వారి కోసం కాదు. అది పూర్తిగా A స‌ర్టిఫికెట్ సినిమా. అలాంటి సినిమాల‌కు 18 ఏళ్లు నిండనివాళ్ల‌కు అనుమ‌తి లేదు. వాళ్ల‌ని అస్స‌లు థియేట‌ర్ల‌లోప‌లికే అనుమ‌తించ‌కుండా చూడాల్సింది'' అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. 

సంబంధిత వార్తలు..

జగిత్యాల ప్రేమ దేశం కథ: అక్కా చెల్లెళ్లతో వన్‌సైడ్ లవ్, భయంతోనే....

జగిత్యాల ప్రేమదేశం కథ: ఇద్దరమ్మాయిలతో చాటింగ్, ప్లాన్‌తోనే ఆత్మహత్యలు

జగిత్యాల ప్రేమ దేశం కథలో ట్విస్ట్: ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్

జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

ప్రేమదేశం సినిమా తరహాలో ఒక అమ్మాయి కోసం... (వీడియో)

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు