Asianet News TeluguAsianet News Telugu

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

జగిత్యాల జిల్లాలో ఇద్దరు టెన్త్ విద్యార్థుల సజీవదహనం వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందించింది.. ఇద్దరు విద్యార్థుల్లో మహేందర్ అనే విద్యార్థి రోజూ స్కూలుకు వస్తాడని.. రవితేజ అప్పుడప్పుడే స్కూలుకు వస్తాడని సెయింట్ జాన్ స్కూలు కరస్పాండెంట్ శోభ తెలిపారు.

friends burnt alive for love: school correspondence response
Author
Jagtial, First Published Oct 1, 2018, 11:04 AM IST

జగిత్యాల జిల్లాలో ఇద్దరు టెన్త్ విద్యార్థుల సజీవదహనం వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందించింది.. ఇద్దరు విద్యార్థుల్లో మహేందర్ అనే విద్యార్థి రోజూ స్కూలుకు వస్తాడని.. రవితేజ అప్పుడప్పుడే స్కూలుకు వస్తాడని సెయింట్ జాన్ స్కూలు కరస్పాండెంట్ శోభ తెలిపారు.

అయితే వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తమకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థుల మృతికి సంతాపంగా ఇవాళ స్కూలుకు సెలవుకు ప్రకటించినట్లు శోభ తెలిపారు.

ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రవితేజ, మహేందర్ అనే విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వారి మధ్య వివాదం చెలరేగింది.. దీనిలో భాగంగా ఆదివారం మద్యం సేవించిన వీరిద్దరూ అమ్మాయి విషయంలో మరోసారి గొడవకు దిగారు. అది శృతిమించడంతో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో.. సజీవ దహనమయ్యారు.

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

Follow Us:
Download App:
  • android
  • ios