Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల ప్రేమ దేశం కథలో ట్విస్ట్: ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్

ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావంతో  జగిత్యాలలో ఇద్దరు టెన్త్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

jagityal sucide: mahendar and raviteja committed suicide for love failure
Author
Jagtial, First Published Oct 1, 2018, 4:33 PM IST

జగిత్యాల: ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావంతో  జగిత్యాలలో ఇద్దరు టెన్త్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ప్రేమ విఫలమైందని ఈ ఇద్దరు విద్యార్థులు సజీవదహనం చేసుకొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

జగిత్యాలలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న మహేందర్, రవితేజలు  ఆత్మహత్య చేసుకొన్న ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకే అమ్మాయిని లవ్ చేశారని... ఈ విషయమై ఇద్దరు స్నేహితులు పరస్పరం  నిప్పంటించుకొని మృతి చెందారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు  ప్రాథమికంగా దొరికిన ఆధారాల ప్రకారంగా సమాచారాన్ని సేకరించారు.  వీరిద్దరితో పాటు మరో స్నేహితుడు ప్రణయ్ కూడ కొద్దిసేపు చనిపోయిన వారితో ఉన్నాడు. ప్రణయ్‌తో పాటు ఇతర స్నేహితుల వద్ద పోలీసులు సమాచారాన్ని సేకరించినట్టు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావంతోనే విద్యార్థులు  ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.

తమ ప్రేమ వైఫల్యం కారణంగానే  వీరిద్దరూ కూడ ఆత్మహత్య చేసుకొన్నారని  ఆయన తెలిపారు. అయితే ఇదిలా ఉంటే  ఈ ఘటనపై అనేక అనుమానాలను మహేందర్ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

ప్రేమదేశం సినిమా తరహాలో ఒక అమ్మాయి కోసం... (వీడియో)

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

Follow Us:
Download App:
  • android
  • ios