తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని పొందిన నందమూరి తారకరామారావు గారి జీవితం గురించి దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఆయన మరణించిన 20ఏళ్ల తరువాత బయోపిక్ లు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఇక లక్ష్మి పార్వతికి కి సంబందించిన రెండు కథలు తెరపైకి వస్తుండడం మరింత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 

అసలు మ్యాటర్ లోకి వస్తే లక్ష్మీస్ వీరగ్రంధం పై కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్రలో శ్రీ రెడ్డి నటించనున్నట్లు కేతిరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశానికి ముందు ఏం జరిగిందనే అంశాలతో తాను సినిమాను తియనున్నట్లు కేతిరెడ్డి తెలిపారు. 

ఇక శ్రీరెడ్డితో ఇప్పటికే చెన్నైలో సంప్రదింపులు జరిపామని చెబుతూ గతంలో శ్రీ రెడ్డి కారణంగా జరిగిన పరిణామాలే ఆమెకు ఈ అవకాశం వచ్చేలా చేసిందని వారు వివరించారు. క్యాస్టింగ్ కౌచ్ నుంచి రామ్ గోపాల్ వర్మ వివాదం వరకు శ్రీ రెడ్డి ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వర్మ ద్వారా శ్రీ రెడ్డి వ్యవహారం ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో వర్మ శ్రీ రెడ్డికి అవకాశాలు రావడానికి ఒక ముఖ్యకారణమని అంటున్నారు. 

సంబంధిత వార్తలు 

వర్మను భయంతో వణికించే విషయం ఇదే!

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!