MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Ilaiyaraaja: 90 నిమిషాల్లో 7 పాటలు.. అరుదైన రికార్డు మ్యూజిక్ మాస్ట్రో సొంతం

Ilaiyaraaja: 90 నిమిషాల్లో 7 పాటలు.. అరుదైన రికార్డు మ్యూజిక్ మాస్ట్రో సొంతం

ఇళయరాజా కేవలం గంటన్నర సమయంలో ఏకంగా ఏడు పాటలకు ట్యూన్స్ కట్టి సంగీత ప్రపంచంలో ఒక కొత్త రికార్డు సృష్టించారు. మూడు దశాబ్దాలు దాటినా ఈ పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2026, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇళయరాజా ఎవర్ గ్రీన్ హిట్స్
Image Credit : Asianet News

ఇళయరాజా ఎవర్ గ్రీన్ హిట్స్

1993లో విడుదలైన 'అరణ్మనై కిళి' సినిమా నటుడు, దర్శకుడు రాజ్‌కిరణ్ కెరీర్‌లో చాలా ముఖ్యమైనది. కుటుంబ బంధాలు, ప్రేమ, పల్లెటూరి వాతావరణం చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంగీతమే పెద్ద బలం. ఇళయరాజా స్వరపరిచిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. 

ఈ పాటలు పుట్టిన విధానం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా కథ, పాటల సందర్భాలు విన్న వెంటనే ఇళయరాజా కేవలం గంటన్నరలోనే ఏడు పాటలకు ట్యూన్స్ కట్టేశారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
90 నిమిషాల్లో 7 పాటలకు ట్యూన్స్
Image Credit : Asianet News

90 నిమిషాల్లో 7 పాటలకు ట్యూన్స్

'అరణ్మనై కిళి' కోసం ఇళయరాజా కేవలం 90 నిమిషాల్లో 7 పాటలకు ట్యూన్స్ కట్టారని చిత్ర యూనిట్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. సాధారణంగా ఒక సినిమా పాటలకు ట్యూన్స్ కట్టడానికి చాలా రోజులు లేదా వారాలు పడుతుంది. కానీ ఇళయరాజా తన టాలెంట్ తో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 

రాజ్‌కిరణ్ కథలోని సందర్భాలను వివరిస్తుండగానే, ఇళయరాజా వెంటనే ప్రతి సీన్‌కు తగిన ట్యూన్స్‌ను తన హార్మోనియంపై వాయించడం మొదలుపెట్టారట. ఆ వేగం చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారని చెబుతారు.

36
ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్..
Image Credit : Facebook

ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్..

సినిమా కథ మొత్తం విన్న తర్వాత, ప్రతి పాట ఏ ఎమోషన్‌ను పలికించాలో ఇళయరాజా కొన్ని నిమిషాల్లోనే అర్థం చేసుకున్నారు. ప్రేమ, విరహం, కుటుంబ బంధం, పల్లెటూరి నేపథ్యం లాంటి విభిన్న ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ రెడీ చేశారు. ఆయన హార్మోనియం నుంచి వచ్చిన మొదటి స్వరాలే, ఆ తర్వాత తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన పాటలుగా మారాయి. ఆ ట్యూన్స్‌కు తగ్గట్టుగా పాటల రచయితలు కూడా వేగంగా సాహిత్యాన్ని అందించారు.

46
గాత్రంతో ప్రాణం పోసిన జానకి..
Image Credit : Facebook

గాత్రంతో ప్రాణం పోసిన జానకి..

ఈ సినిమాలోని పాటలు ఒక్కొక్కటి ఒక ఆణిముత్యం. 'అడి పూంగుయిలే' పాటను మనో, మిన్మిని పాడారు. వాలి రాసిన ఈ పాట పల్లెటూరి ప్రేమను అందంగా చూపిస్తుంది. 'రాసావే ఉన్నై విడ' పాటను ఎస్. జానకి తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రేమ విరహ వేదనను తెలిపే ఈ పాట తమిళంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సాడ్ సాంగ్స్‌గా నిలిచింది.

 'వాన్మదియే వాన్మదియే' కూడా జానకి పాడిన మరో మెలోడీ. 'ఎన్ తాయెనుమ్ కోయిలై' పాటను ఇళయరాజా స్వయంగా పాడారు. పొన్నడియాన్ రాసిన ఈ పాట తల్లి ప్రేమ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. 'అమ్మన్ కోవిల్ ఎల్లామే' పాటను స్వర్ణలత, మిన్మిని పాడారు. ముత్తులింగం రాసిన ఈ పాట పండగ వాతావరణాన్ని గుర్తుచేస్తుంది. 

ఇక 'నాటు వ రోజా' పాటను పి. సుశీల పాడారు. పిరైసూడన్ రాసిన ఈ పాట అప్పట్లో పెద్ద హిట్. 'రాత్రియిల్ పాడుమ్ పాటను అరుణ్‌మొళి, మలేషియా వాసుదేవన్, మిన్మిని కలిసి పాడారు. వాలి రాసిన ఈ పాట ఆడియన్స్ ను అలరించింది. 

56
ఇళయరాజా మ్యాజికల్ మ్యూజిక్‌
Image Credit : Facebook

ఇళయరాజా మ్యాజికల్ మ్యూజిక్‌

'అరణ్మనై కిళి' సినిమా పాటలు సంగీతం, సాహిత్యం, గానం అద్భుతంగా కుదిరిన ఆల్బమ్. వాలి, ముత్తులింగం, పొన్నడియాన్, పిరైసూడన్ వంటి గొప్ప రచయితల సాహిత్యం, ఇళయరాజా మ్యాజికల్ మ్యూజిక్‌తో కలిసి ఈ ఆల్బమ్‌ను టైమ్‌లెస్ క్లాసిక్‌గా మార్చాయి. కేవలం గంటన్నరలో పుట్టిన ఈ ఏడు ట్యూన్స్, మూడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అందుకే 'అరణ్మనై కిళి' పాటలు కేవలం సినిమా పాటలు కాదు, సినిమా సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.

66
30 ఏళ్లకు పైగా ప్రేక్షకుల మనసుల్లో..
Image Credit : Asianet News

30 ఏళ్లకు పైగా ప్రేక్షకుల మనసుల్లో..

ఆ పాటల గొప్పతనం ఏమిటంటే, అవి కేవలం సినిమా పాటలుగా మిగిలిపోకుండా ప్రజల జీవితంలో భాగమైపోయాయి. వాలి, ముత్తులింగం, పొన్నడియాన్, పిరైసూడన్ వంటి కవుల సాహిత్యం, ఇళయరాజా అద్భుతమైన సంగీతంతో కలిసి ఈ ఆల్బమ్‌ను ఒక సంగీత నిధిగా మార్చాయి.  ఇప్పటికీ ఈ పాటలు అక్కడ సంగీత కచేరీలలో వినిపిస్తూనే ఉంటాయి. కేవలం 90 నిమిషాల్లో పుట్టి, 30 ఏళ్లకు పైగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఇలాంటి ఆల్బమ్స్ చాలా అరుదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image2
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved