Asianet News TeluguAsianet News Telugu

#Adipurush: ‘ఆదిపురుష్’ వాయిదా అసలు కారణం వేరేనా?

మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, వాయిదా పడిన విషయం మాత్రం దాదాపు కన్ఫమ్ అయినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో, మీడియాలో  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. 

Reason Behind Prabhas Adipurush Postponement
Author
First Published Oct 31, 2022, 11:08 AM IST


 ఎంతో ఇష్టపడి తన సొంత బ్యానర్ పై నిర్మించిన రాధేశ్యామ్ డిజాస్టర్‌ అవ్వడంతో.. ప్రభాస్ నుంచి తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆ టైమ్ లో  ‘ఆదిపురుష్’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటన ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమా  వాయిదా వేశారు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, వాయిదా పడిన విషయం మాత్రం దాదాపు కన్ఫమ్ అయినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో, మీడియాలో  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వాయిదాకు కారణాలు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి.

కొందరైతే సంక్రాంతికి థియేటర్స్ సరిగ్గా దొరకవని వాయిదా వేసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు.. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్‌కి వచ్చిన వ్యతిరేకత కారణం అంటున్నారు. లైవ్ యాక్షన్ సినిమా అని చెప్పి, టీజర్‌లో మొత్తం బొమ్మలనే చూపించాడంటూ దర్శకుడు ఓమ్ రౌత్‌ని విమర్శించటాన్ని గుర్తు చేస్తున్నారు. టీజర్ ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉందంటూ ఏకిపారేశారు. దీంతో, గ్రాఫిక్స్ వర్క్‌పై ఓమ్ రౌత్ మరింత కసరత్తు చేస్తున్నట్టు, అందుకే టైమ్ పడుతుందని ,వాయిదా వేసారని చెప్పుకుంటున్నారు. అయితే అసలు కారణం అది కాదని, సంక్రాంతికి తెలుగు విడుదలలు మాత్రమే కాకుండా ,తమిళ విడుదలలు కూడా భారిగా ఉండటం కారణమనే ప్రచారం తెలుస్తోంది.

తెలుగులో థియేటర్స్ అంటే ప్రభాస్ కు ఉన్న క్రేజ్, పరిచయాలతో మ్యానేజ్ చేస్తాం..కానీ తమిళంలో విజయ్, అజిత్ చిత్రాలు రెండూ రిలీజ్ అవుతున్నాయి. అక్కడ థియేటర్స్ దొరకటం చాలా కష్టం. ఓ డబ్బింగ్ సినిమాగా అక్కడ మీడియా ప్రొజెక్టు చేస్తుంది. ప్రభాస్ కు అక్కడ ప్రత్యేకమైన మార్కెట్ లేదు. ఈ నేపధ్యంలో సోలో రిలీజ్ కావాలంటే కొద్ది నెలలు వేచి ఉండి రిలీజ్ చేయటమే బెస్ట్ అనే నిర్ణయానికి హీరో,నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకాస్త టైమ్ ఉంటే గ్రాఫిక్స్ లా కాకుండా సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఔట్‌పుట్ తీసుకొచ్చేందుకు సరిపోతుందని  ఇలా వాయిదా నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. 

 రామాయణం ఇతివృత్తంతో రూపొందుతోన్న ఈ సినిమాకి సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ కథానాయికగా (సీత పాత్రలో) నటిస్తుండగా.. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఇక రావణుడు పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. సమ్మర్‌కి వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి కానీ, తేదీ ఎప్పుడన్నదే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ నిర్మిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios