Asianet News TeluguAsianet News Telugu

ఓసారి చేసుకున్నా కూడా బుద్ధి రాలేదా?..సుమంత్‌ రెండో పెళ్లిపై వర్మ చురకలు

సుమంత్‌ రెండో పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాజాగా దీనిపై వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్‌లో స్పందించారు. సుమంత్‌కి చురకలంటించాడు. 

ram gopal varma shocking comments on sumanth second marriage arj
Author
Hyderabad, First Published Jul 28, 2021, 6:38 PM IST

హీరో సుమంత్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు తాజాగా ఊపందుకున్న విషయం తెలిసిందే. ఆయన పవిత్ర అనే అమ్మాయితో వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్న,త్వరలో వీరి మ్యారేజ్‌ జరగబోతున్నట్టు ఓ వెడ్డింగ్‌ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాజాగా దీనిపై వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్‌లో స్పందించారు. సుమంత్‌కి చురకలంటించాడు. 

 ట్విట్టర్‌ ద్వారా వర్మ స్పందిస్తూ, `ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? సుమంత్‌. నీ కర్మ, ఆ పవిత్ర కర్మ. అనుభవించండి` అని ట్వీట్‌ చేశారు వర్మ. దీంతో ఇప్పుడిది సోషల్‌ మీడియాలో మరింత వైరల్‌గా మారింది. సుమంత్‌ పెళ్లికి సంబంధించి వార్త ఇంకా అధికారికంగా కన్ఫమ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో వర్మ ఘాటుగా స్పందించడం విశేషం. 

తన బంధువులకు చెందిన అమ్మాయి పవిత్ర అని తెలుస్తుంది. ఆగస్ట్ లోనే వీరి వివాహం జరిగే అవకాశాలున్నాయట. అతికొద్ది మందితో వివాహ వేడుక ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సుమంత్‌ 2004లో `తొలి ప్రేమ` ఫేమ్‌ కీర్తిరెడ్డిని వివాహం చేసుకుని రెండేళ్లకే విడాకులిచ్చారు. ఆ తర్వాత ఇన్నాళ్లపాటు ఖాళీగానే ఉన్న సుమంత్‌ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త చర్చనీయాంశంగా, క్రేజీగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios