Asianet News TeluguAsianet News Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నమ్మలేని ఎమోషన్స్.. వర్మ కామెంట్స్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కాసేపు మాట్లాడారు వర్మ

ram gopal varma on lakshmies ntr
Author
Hyderabad, First Published Oct 19, 2018, 2:06 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కాసేపు మాట్లాడారు వర్మ.

''నేను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు దేవుడిని దర్శించుకోలేదు. కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవడంతో తిరుమల వెంకన్నని దర్శించుకున్నాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నిజాలను ప్రజలకి అందించే ప్రయత్నం విజయవంతం కావాలని దేవుడ్ని ప్రార్ధించాను.

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నమ్మలేని ఎమోషన్స్ ఉంటాయి. వాటిని చూపించే ధైర్యం, సాహసం, శక్తి నాకు ఇవ్వమని తిరుమల బాలాజీని వేడుకున్నాను. ఇది మనసుతో చేయాల్సిన సినిమా'' అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉండగా మరో రెండు గంటల్లో తిరుపతిలో శిల్పారామంలో ప్రెస్ మీట్ పెట్టి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లడబోతున్నారనే ఆసక్తి నెలకొంది!

ఇది కూడా చదవండి.. 

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన


ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios