రజినీకాంత్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తుంటారు. కొద్దిరోజుల క్రితం రోబో '2.0' సందడి చేసిన రజిని ఇప్పుడు 'పేటా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ముఖ్యంగా తలైవా అభిమానులు ఇది పెర్ఫెక్ట్ పొంగల్ సినిమా అంటూ సోషల్ మీడియా వేదికగా  స్పందిస్తున్నారు. రజినీకాంత్ స్టైల్, మేనరిజమ్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఓవర్సీస్ లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అమెరికాలో 220 లోకేషన్స్ లో 'పేటా' విడుదలైంది. నిన్న రాత్రి సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు.

ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో 5,45,000 డాలర్లు వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపు రూ.3 కోట్ల 84 లక్షలు. ఇంకా పూర్తి కలెక్షన్స్ వివరాలు తెలియాల్సివున్నాయి. రజినీకాంత్ నటించిన చిత్రాలు కబాలి, 2.0 లతో పోలిస్తే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చాలా తక్కువని తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో ఎక్కువ సినిమాలు విడుదల అవుతుండడంతో 'పేటా'కి తక్కువ థియేటర్లు దొరికాయి. శుక్ర, శని వారాలలో మరో రెండు పెద్ద సినిమాల రిలీజ్ లు ఉండడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

రజినీకాంత్ మేనియా.. 'పేటా' థియేటర్ బయట పెళ్లి!

పాత ఊట...(రజనీ 'పేట' రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: పేట

'పేటా' ట్విట్టర్ రివ్యూ!