సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన సినిమాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

తాజాగా ఆయన నటించిన 'పేటా' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 90ల నాటి రజినీకాంత్ ని గుర్తు చేసిన పక్కా మాస్ సినిమా ఇదని ప్రీమియర్ షోలకు వెళ్లిన అభిమానులు అంటున్నారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయలు చెబుతున్నారు.

సినిమా అదిరిపోయిందని, రజినీకాంత్ స్టైల్ లో పక్కా మాస్ ఫిలిం అని ప్రసంశలు కురిపిస్తున్నారు. కొందరు అభిమానులు రజినీకాంత్ 'బాషా' సినిమాను మించిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు.

హాస్టల్ వార్డెన్ పాత్రలో రజినీకాంత్ కామెడీ టైమింగ్, నటన, ఫైట్లు బాగున్నాయని టాక్. అనిరుద్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని, అధ్బుతమైన సంగీతం ఇచ్చాడని పొగుడుతున్నారు. తలైవా ఫ్యాన్స్ ఇది పెర్ఫెక్ట్ పొంగల్ సినిమా అని అంటున్నారు.