2పాయింట్O సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయిన సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సారి పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలని పేట సినిమాతో వచ్చాడు. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవా ఎంతవరకు ఆకట్టుకుంటారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఈ సినిమాకు తమిళ్ లో క్రేజ్ బాగానే ఉన్నా మొదటిసారి తెలుగులో రజినీకాంత్ సినిమాకు థియేటర్స్ అడ్జస్ట్ కాకపోవడం గమనార్హం.

ఇక సినిమా ప్రీమియర్స్ ముందే యూఎస్ లో ప్రదర్శించబడ్డాయి. సినిమాలో రజినీకాంత్(కాలా) ఎప్పటిలానే తన మార్క్ స్టైల్ తో డైలాగులతో ఆకట్టుకున్నాడు. ఇక బాషా ఫ్లాష్ బ్యాక్ తరహాలో పేట కూడా ఉండటం కోస మెరుపు. హాస్టల్ వార్డెన్ గా ఉండే రజినీకాంత్(కాలా) అనుకోని విధంగా హాస్టల్ లో జరిగే అరాచకాల వల్ల విలన్స్ దృష్టిలో పడతాడు. రజనీకాంత్ వారిని అడ్డుకునేందుకు వేసే ప్లాన్స్ ఆకట్టుకుంటాయి. 

ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి రజినీకాంత్ అసలు క్యారెక్టర్ పేట అని తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో ఇదే హైలెట్. పేట వీర ఎవరు అనే ట్విస్ట్ ఆసక్తిని రేపుతోంది. సిమ్రాన్ ఓ స్టూడెంట్ తల్లిగా కనిపించిన విధానం అలాగే ఆమె రజనీతో సన్నిహితంగా ఉండటం బాగానే ఉంది గాని సీన్స్ మధ్యలో కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ రజినీకాంత్ పాత్ర నడిచే విధానం మేజర్ ప్లస్ పాయింట్. అసలు త్రిష ఎవరు? అసలు రజినీకాంత్ గతం ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే.

సినిమా ఫస్ట్ హాఫ్ పరవలేదనిపించగా సెకండ్ హాఫ్ అలా అలా సాగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అయినప్పటికీ ఫ్యాన్ విజిల్స్ వేసే మూమెంట్స్ బాగానే ఉన్నాయి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంతో మరోసారి మెప్పించాడు. మెయిన్ గా అనిరుద్ సంగీతం అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. మరి సినిమా ఆడియెన్స్ కి ఏ స్థాయిలో నచ్చుతుందో చూడాలి.