మెగాస్టార్ ఇంట విషాదం!

rajan nanda father in law of amitabh bachchan's daughter passed away
Highlights

రాజన్ నందా స్వర్గస్తులైన విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'మా బంధువు రాజన్ నందా, నిఖిల్ తండ్రి, శ్వేత మామగారు మృతి చెందారు. నేను ఇండియాకు బయలుదేరి వస్తున్నా' అంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన వియ్యంకుడు ఎస్కార్ట్స్ గ్రూప్ అధినేత రాజన్ నందా నిన్న రాత్రి మరణించారు. రాజన్ నందా.. అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ కు మావయ్య. రాజన్ నందా కుమారుడు నిఖిల్ నందాను శ్వేతా వివాహం చేసుకున్నారు.

ఆయన చనిపోయే సమయానికి అమితాబ్ 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ కోసం బల్గేరియాలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇండియాకు బయలుదేరి వచ్చారు. రాజన్ నందా స్వర్గస్తులైన విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'మా బంధువు రాజన్ నందా, నిఖిల్ తండ్రి, శ్వేత మామగారు మృతి చెందారు. నేను ఇండియాకు బయలుదేరి వస్తున్నా' అంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. బిగ్ బి. రాజన్ నందాకు ఇద్దరు పిల్లలు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. 

loader