బిగ్ బాస్ హౌస్ లో బ్రహ్మానందం కొడుకు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 7, Sep 2018, 4:24 PM IST
raja gautam in bigg boss house
Highlights

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ చివరిదశకు చేరుకుంటోంది. తాజాగా హౌస్ మేట్స్ కి 'టికెట్ టు ఫినాలే' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టికెట్ సంపాదించుకోవడానికి కార్ టాస్క్ ఒకటి ఇచ్చారు

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ చివరిదశకు చేరుకుంటోంది. తాజాగా హౌస్ మేట్స్ కి 'టికెట్ టు ఫినాలే' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టికెట్ సంపాదించుకోవడానికి కార్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఈ టాస్క్ లో గెలిచే వారిని ఎలిమినేషన్ నుండి మినహాయింపు కల్పిస్తూ ఫినాలేకి వెళ్లే ఛాన్స్ కల్పించనున్నారు.

ఇక మొదటి నుండి షోలో సినిమాలను ప్రమోట్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా 'మను' సినిమా హీరో, హీరోయిన్లు రాజా గౌతమ్, చాందిని చౌదరిలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వీరితో హౌస్ మేట్స్ ఎంతో సరదాగా మాట్లాడుతున్న ప్రోమోని విడుదల చేశారు.

హీరోయిన్ చాందిని బయట ఎప్పుడూ చేయలేనిది ఇక్కడకి వచ్చి మీరేం చేశారని ప్రశ్నించగా  దానికి సమాధానంగా ఒక్కొక్కరూ ఫన్నీగా సమాధానాలు చెప్పారు. ఇక హీరో రాజా గౌతమ్ అందరూ చాలా బాగా ఆడుతున్నారని హౌస్ మేట్స్ ని పొగిడారు. ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి టెలికాస్ట్ కానుంది. 

 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్: ఎన్టీఆర్, నానికి అదే సమస్య!

బిగ్ బాస్2: కౌశల్.. కావాలని కెలుక్కోకు.. గీతామాధురి వార్నింగ్!

గీతామాధురిపై సెటైర్లు.. భర్త నందు ఆగ్రహం!

loader