Asianet News TeluguAsianet News Telugu

అబ్బే.. నిజంకాదు, రూమరే నమ్మద్దు

'ఉయ్యాల జంపాల' 'సినిమా చూపిస్తా మావ' 'కుమారి 21ఎఫ్'తో హ్యాట్రిక్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ఎందుకో వెనకబడిపోయారు. టాలీవుడ్  హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న  రాజ్ తరుణ్ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏమీ పెద్దగా కలిసిరాలేదు. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మా ఇద్దరి మధ్యా డిజాస్టర్ అవటంతో చాలా మంది ఆయన కెరీర్ ముగిసినట్లుగానే భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజ్ తరణ్ తో మొదలువుతుందనుకున్న  'డ్రీమ్ గర్ల్' సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలు మొదలయ్యాయి. 

Raj Tarun Dream girl remake  will start some time
Author
Hyderabad, First Published May 14, 2020, 12:03 PM IST

కెరీర్ ప్రారంభంలో వచ్చిన  'ఉయ్యాల జంపాల' 'సినిమా చూపిస్తా మావ' 'కుమారి 21ఎఫ్'తో హ్యాట్రిక్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ఎందుకో వెనకబడిపోయారు. టాలీవుడ్  హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న  రాజ్ తరుణ్ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏమీ పెద్దగా కలిసిరాలేదు. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మా ఇద్దరి మధ్యా డిజాస్టర్ అవటంతో చాలా మంది ఆయన కెరీర్ ముగిసినట్లుగానే భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజ్ తరణ్ తో మొదలువుతుందనుకున్న  'డ్రీమ్ గర్ల్' సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలు మొదలయ్యాయి. 

క్రితం సంవత్సరం బాలీవుడ్ లో హై సక్సెస్  సాధించిన సినిమాల్లో 'డ్రీమ్ గర్ల్' ఒకటి. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ కథానాయకుడిగా నటించాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 200 కోట్లను వసూలు చేయగా, తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రాజ్ తరుణ్ హీరోగా సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటన వచ్చింది. ఆ తరువాత కరోనా, లాక్ డౌన్ ప్రభావం చిత్రపరిశ్రమపై కూడా పడింది. దాంతో ఆర్థికపరమైన ఇబ్బందులవలన సురేశ్ బాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడనే ప్రచారం జరుగుతోంది. 

ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పందిస్తూ .. 'డ్రీమ్ గర్ల్'  సినిమాకి రీమేక్ వుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు' అని చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా రాజ్ తరుణ్ వరుస ఫ్లాఫ్ లనే  ఎదుర్కుంటూ వస్తున్నాడు. దాంతో ఆయన ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కరోనా కష్టాలను దాటుకుని ఈ ప్రాజెక్టు  ఎప్పుడు పట్టాలెక్కుతుందో మరి అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios