లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవటంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే కోలీవుడ్ నటి స్నేహకు ఎదురైంది. రెండు నెలలుగా విద్యుత్‌ చార్జీలు తీయకపోవటంతో కొంతమంది కరెంట్ షాక్‌ కొట్టే రేంజ్‌లో కరెంట్ బిల్లులు వస్తున్నాయి.

స్నేహ ఇంటికి కూడా అదే స్థాయిలో కరెంట్ బిల్లు వచ్చింది. స్నేహ ఇంటితో పాటు ఆమె భర్త ప్రసన్న తండ్రి ఇంటికి కలిపి ఏకంగా 70 వేల దాకా కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ బిల్లుపై స్పందించిన ప్రసన్న. నాకు 70ల మొత్తం చెల్లించే స్థోమత ఉంది. కానీ పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ స్థాయిలో కరెంట్ బిల్లు వస్తే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించాడు ప్రసన్న.

అంతేకాదు కేవలం రెండు నెలలకే నాకు ఈ స్థాయిలో బిల్లు వచ్చింది. గతంలో ఏ రెండు నెలలకు నాకు ఇంత బిల్లు రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు ప్రసన్న. ఈ విషయంపై విద్యుత్‌ శాఖ అధికారులు కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఓ అధికారి మాట్లాడుతూ రెండు నెలలుగా మీటర్‌ రీడింగ్‌లు తీయకపోవటంతో కొన్ని తప్పులు దొర్లాయని అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రసన్నకు వెళ్ళిన విద్యుత్‌ బిల్లు పునఃపరిశీలించి మళ్లీ మీటర్‌ రీడింగ్‌ సక్రమంగా తీసి కొత్త బిల్లు ఇస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన బిల్లును పరిశీలించి సరిచేస్తామని వెల్లడించారు.