Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై కత్తి దూస్తున్న ప్రభాస్, సక్సెస్ అయితే రాజమౌళి కూడా!

బాలీవుడ్ నుంచి అమితా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలడంతో... సిని పరిశ్రమ షాక్ కు గురైంది. ఈ పరిస్దితుల్లో షూటింగులను ఎలా నిర్వహిస్తాం? అలాగని ఎన్నాళ్లు ఖాలీగా ఉంటాం అని పునరాలోచనలో ఇండస్ట్రీ జనం పడ్డారు. అందుకోసం రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా... కరోనా రక్కసి నుంచి యూనిట్ ను కాపాడటంపై దృష్టి సారించింది.

Prabhas Radhe Shyam to introduce Covid Protection wing
Author
Hyderabad, First Published Jul 13, 2020, 2:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై భారీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా భయంతో ప్రభుత్వం ఫర్మిషన్స్ ఇచ్చినా  ఎక్కిడికక్కడ షూటింగులు ఆగిపోయాయి. షూటింగులు జరుగుతున్న ఒకటి, రెండు చోట్ల కూడా నటులు, సిబ్బంది కరోనా బారిన పడటం అందరినీ భయపెడుతోంది. ఇప్పటికే తెలుగు టీవి నటులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. అలాగే బాలీవుడ్ నుంచి అమితా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలడంతో... సిని పరిశ్రమ షాక్ కు గురైంది. ఈ పరిస్దితుల్లో షూటింగులను ఎలా నిర్వహిస్తాం? అలాగని ఎన్నాళ్లు ఖాలీగా ఉంటాం అని పునరాలోచనలో ఇండస్ట్రీ జనం పడ్డారు. అందుకోసం రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా... కరోనా రక్కసి నుంచి యూనిట్ ను కాపాడటంపై దృష్టి సారించింది.

ఇండస్ట్రీలో కోవిడ్ ప్రొటెక్షన్ అనే సరికొత్త విభాగాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అవుట్ డోర్ లో కానీ, ఇండోర్ లో కానీ యూనిట్ లో ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టడమే ఈ విభాగం పని. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ విభాగం రక్షణ చర్యలను చేపడుతుంది. మొదటగా ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' షూటింగును ఈ విధానం ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. కెమెరాలను, కాస్ట్యూమ్స్ ను ప్రత్యేకమైన పద్ధతుల్లో శుభ్రపరుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కరోనా ఇన్సూరెన్స్ ని కూడా అందులో చేరుస్తారని చెప్తున్నారు. రాధేశ్యామ్ షూటింగ్ కనుక ఈ విధానంలో సక్సెస్ అయితే ఆర్ ఆర్ ఆర్ కూడా మొదలెడతారట. 
 
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి 'రాధే శ్యామ్' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ - పూజాహెగ్డే లను చూసిన వారు ఈ సినిమా ఒక ఫ్యూర్ లవ్ స్టోరీ గా డిజైన్ చేయబడిందని అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా 'రాధే శ్యామ్' టైటిల్ చూస్తుంటే ఈ సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని పూర్తిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రెబర్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ టీ సిరీస్ వారు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర భాషల నటీనటులు కూడా 'రాధే శ్యామ్' లో యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటి భాగ్యశ్రీ స్టార్ కమెడియన్ ప్రియదర్శి తమిళ నటుడు సత్యన్ మలయాళ నటుడు సచిన్ ఖేడేకర్ ఎయిర్టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్ ప్రముఖ నటుడు మురళి శర్మ సహా మరికొందరు ఇతర తారాగణం ఈ సినిమాలో కనిపిస్తున్నారు. 

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని 2021 లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్న మేకర్స్ అనౌన్స్ చేసారు. 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios