కరోనాతో అన్ని రంగాలూ కుదేలైపోయిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా కోట్లతో వ్యాపారం జరిగే సినిమా రంగంపై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. కరోనాతో మొట్టమొదట నిలిచిపోయినవి సినిమాలే. ఆ తర్వాత షూటింగ్ లు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలన్నీ విడుదలకి నోచుకోక ల్యాబుల్లోనే మగ్గుతున్నాయి. వాటిమీద పెట్టిన  పెట్టుబడులపై వడ్డీల భారం నిర్మాతలకు నిర్మాతలను నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాతైనా సినిమా హాళ్లు తెరచుకుంటాయా? తమ అభిమాన హీరో సినిమా చూడచ్చా అని ఫ్యాన్స్ ఎదురుచూపుల్లో గడిపేస్తున్నారు. 

కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ...మాత్రం ఓ అడుగు ముందకేసి ప్రొడక్షన్ హౌస్ యువి క్రియోషన్స్ ని ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తో  ట్రెండింగ్ చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి  ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి వాళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. 

 దాంతో ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మే రెండో వారం  లేదా మూడో వారంలో విడుదల చేయటానికి నిర్మాతలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.టైటిల్ ని సైతం ఫస్ట్ లుక్ తో పాటే వదులుతారు. లాక్ డౌన్ పీరియర్ మే 3 తో పూర్తవుతుంది. ఈ క్రమంలో అభిమానులకు ఈ  గిప్ట్ అందించాలని ప్రభాస్ నిర్ణయించినట్లు చెప్తున్నారు. అయితే నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పటి నుంచి అనేది మాత్రం తెలియరాలేదు. 

 అలాగే ఇప్పటికే  చాలా పెద్ద సినిమాలు అక్టోబర్ కు లేదా వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకుంటున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తేసినా వెంటనే సినిమాల్ని విడుదల చేసుకునే పరిస్దితి లేదు. ప్రేక్షకులు మునుపటిలా వచ్చే అవకాశం అయితే లేదు. 
జనం మెల్లిగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ 5 తదితర ఓటీటీ (ఓవర్‌ ది  టాప్‌) మాధ్యమాలు లకు అలవాటు పడుతున్నారు.