టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే గుర్తొచ్చేది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కొంతకాలంగా ప్రభాస్, అనుష్కలు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ జంట ఆ వార్తలను కొట్టిపడేస్తూనే ఉంది.

ఇంతలో ప్రభాస్ కి పెళ్లి కుదిరిందని, భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రభాస్-అనుష్కల టాపిక్ తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరూ రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

వీరిద్దరూ కలిసి రాజస్థానీ సంప్రదాయంలో బట్టలు ధరించి డాన్స్ లు కూడా చేశారని టాక్. ఇక నిన్న రాత్రి జరిగిన పెళ్లిలో వీరిద్దరూ కలిసి ఒకే చోట కలిసి ఉండడంతో మరోసారి పెళ్లి పుకార్లు గుప్పుమన్నాయి. ఫోటోలలో ఇద్దరూ అందంగా ఉన్నారని, త్వరలోనే పెళ్లి వార్త కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

మరి ఈ వార్తలపై ప్రభాస్, అనుష్కలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. అలానే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలానే అనుష్క.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది.  

 

జై బాలయ్య అంటూ తారక్ అరుపులు!

రాజమౌళి కొడుకు పెళ్లిలో తారక్ రచ్చ చూశారా..?

రాజమౌళి, రామ్ చరణ్ డాన్స్ చూశారా..?

పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!

రాజమౌళి కొడుకు పెళ్లి.. అతిథులు వీళ్లే..!

రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!