దర్శకధీరుడు రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లిని జైపూర్ లో జరిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. వారిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ప్రభాస్, అనుష్క, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నిలిచారు.

ఇప్పటికే వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. చరణ్, రాజమౌళి, ప్రభాస్ తీన్మార్ డాన్స్ లు చేశారు. ఇక నిన్న రాత్రి జరిగిన పార్టీలో తారక్ స్టేజ్ మీద చేసిన రచ్చ మాములుగా లేదని అంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. 

ముందుగా కీరవాణి స్టేజ్ మీదున్న ప్రభాస్ ని ఓ ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తుంటాడు.. డార్లింగ్ అని పిలుస్తూ ''ఆడవారి వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన అడగకూడదు, అందుకే బాహుబలి సినిమాకు నువ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావని నేను అడగను'' అని అనేలోపు తారక్ స్టేజ్ మీదకి వచ్చేశాడు.

కీరవాణిని ఏడిపిస్తూ కొన్ని కామెంట్స్ చేస్తుండగా... దానికి కీరవాణి 'తారక్ నీది ఎలిఫెంట్ కామెడీ' అని అంటుంటే 'మాకు తెలుసు' అంటూ తారక్ అక్కడున్న వారిని చూస్తూ  ధన్యవాదాలు చెబుతూ ఉంటాడు. కీరవాణి 'తారక్ తారక్' అని ఎంతగా పిలిచినా పట్టించుకోకుండా కామెడీ చేస్తూనే ఉన్నాడు. ఈ వీడియో తారక్ అభిమానులు ఆకట్టుకుంటోంది. 

రాజమౌళి, రామ్ చరణ్ డాన్స్ చూశారా..?

పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!

రాజమౌళి కొడుకు పెళ్లి.. అతిథులు వీళ్లే..!

రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!