టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి డాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు కదా.. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటన తాజాగా చోటుచేసుకుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి వేడుకలు జైపూర్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఈరోజు సంగీత్ రేపు పెళ్లి జరగనున్నాయి. అయితే ఈ పెళ్లి వేడుకకు అతిథులుగా ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మంది జైపూర్ చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నమే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు జైపూర్ చేరుకొని పెళ్లి సంబరాల్లో మునిగిపోయారు.

రెండు రోజులుగా పెళ్లి హడావిడి మాములుగా లేదు. రాజమౌళి, రామ్ చరణ్ కలిసి తీన్మార్ బ్యాండ్ కి హుషారుగా డాన్స్ లు చేస్తూ తెగ ఎంజో చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

కొద్దిరోజుల క్రితమే కార్తికేయకి జగపతి బాబు అన్నకూతురితో నిశ్చితార్ధం జరిగింది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు  వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. 

 

పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!

రాజమౌళి కొడుకు పెళ్లి.. అతిథులు వీళ్లే..!

రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!