దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తను ప్రేమించిన పూజా ప్రసాద్ ని నిశ్చితార్దం చేసుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు. డిసంబర్ 30న ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోంది.

రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ లో వీరి వివాహం జరగనుంది. 250 ఎకరాల్లో ముఘల్ స్టైల్ లో ఉండే సెవెన్ స్టార్ హోటల్ ఈ పెళ్లికి వేదిక కానుంది. ఇప్పటికే రాజమౌళి 
కుటుంబ సభ్యులు జైపూర్ కి చేరుకున్నారు.

తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ కుటుంబాలతో కలిసి పెళ్లి వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి భార్య రమా రాజమౌళితో ఎన్టీఆర్, చరణ్ ఎంతో సన్నిహితంగా తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పెళ్లి వేడుక పూర్తి కాగానే ఈ ఇద్దరు హీరోలు తిరిగి హైదరాబాద్  చేరుకోనున్నారు. రాజమౌళి కుటుంబం మాత్రం న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకొని ఆ తరువాత కొత్త జంటతో హైదరాబాద్ చేరుకుంటారు.