కొరటాల కథలు దొంగలించారు!

Posani says koratala shiva stories theft by few directors
Highlights

కొరటాల కథలు దొంగలించారు!

నిన్న జరిగిన భరత్ అనే నేను సక్సెస్ మీట్ లో పోసాని కృష్ణ మురళి ఒక దర్శకుడి మీద విరుచుకు పడ్డారు. తన మేనల్లుడైన కొరటాల శివ చాలా మంచి రచయిత అని..పాజిటీవ్ ఆటిట్యూడ్ ఉన్నవాడిని, అతని దగ్గర ఉన్న కథలు కొంతమంది కాజేశారని, ఆ కథలతో కొరటాల సినిమాలు తీసి ఉంటె.. కొరటాల శివ ఖాతా లో పది బ్లాక్ బస్టర్ హిట్స్ చేరేవని అన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆ దర్శకుడి పేరు పోసాని ప్రస్తావించకపోయినా.. బోయపాటి శీను గురించే పోసాని చెప్పారని, సినిమా ప్రేమికులకు యిట్టె అర్ధం అయిపోతుంది. సింహ సినిమా.. కథ, మాటల విషయం లో బోయపాటికి – కొరటాల శివ కు గొడవలు జరిగాయని .. యూట్యూబ్ లో కొరటాల ఇంటర్వూస్ లో ప్రత్యేకంగా చెప్పారు.

 మరి ఇన్ని తెలిసిన కొరటాల శివ కూడా.. శ్రీమంతుడు కథ, శరత్ చంద్ర రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’ నుండి కాపీ చేసిందే కాదు? ఆ రైటర్ నాంపల్లి కోర్ట్ లో కేసు వేసి భారీ మొత్తం తీసుకున్నట్లు తెలిసిందే కదా. భరత్ అనే నేను కథ కూడా శ్రీహరి నాను దగ్గర నుండి కొరటాల కోటి రూపాయలిచ్చి కొన్నాడని చెప్పుకుంటుంటే … ‘భరత్ కథ నాదే’ అని చెప్పిన కొరటాల, సక్సెస్ మీట్ లో శ్రీహరి నాను కథ ఇచ్చాడని, మా బంధం ఇలాగె కొనసాగాలన్నారు. ఈ రెండు నాల్కల మాటలేల?. సినిమాలో.. మూల కథ శ్రీహరి నాను అని వేసాడనుకోండి. అయినా పోసాని అందించిన కథలు ఏమంత కళాఖండాలు కావు, భద్ర, బృందావనం, సింహ సినిమాలు మామూలు హిట్స్ ఏ కదా..!

loader