తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల హడావిడి దాదాపుగా ముగిసింది. టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల హడావిడి దాదాపుగా ముగిసింది. టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి కేసీఆర్ విజయంపై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ గెలుస్తాడా..? కూటమి గెలుస్తుందా..? అని చాలా మంది నన్ను అడిగారు. తెలంగాణా ప్రజల్లో నీతి, నిజాయితీ ఉంటే కేసీఆరే గెలుస్తాడని చెప్పానని అన్నారు. తెలంగాణా ప్రజలు నిజాయితీతో వ్యవహరించారని.. కేసీఆర్ గెలవాలని దేవుడ్ని ప్రార్ధించినట్లు చెప్పారు. సైంధవుడిలా మధ్యలో చంద్రబాబు గారు డబ్బులతో దిగినట్లు.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని అన్నారు. 

చంద్రబాబు వచ్చి పరిస్థితులను మారుస్తాడా..? అని భయమేసిందని.. ఏదైనా చేసే సత్తా చంద్రబాబుకి ఉందని, ది గ్రేట్ ఎన్టీఆర్ నే చంపాడు. బక్కవాడు ఎంతనే..? భయం తనలో ఉండేదని చెప్పారు. చంద్రబాబుతో పాటు మరో సైంధవుడు వచ్చాడని లగడపాటిని ఉద్దేశించి అన్నారు. 

అన్ని చోట్ల కూటమి గెలుస్తుందని ప్రచారం చేయించారని.. గద్దర్ కూడా భాగస్వామి కావడం చూసి షాక్ తగిలిందని.. ఒక బక్కవాడిని కొట్టడానికి ఇంతమందా..? అని షాక్ అయినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు కేసీఆర్ ని గెలిపించాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేసీఆర్ విజయంపై వర్మ 'ఆగడు' స్పూఫ్ వీడియో!

ఈ విజయానికి మీరు అర్హులు.. కేటీఆర్ పై మహేష్ ట్వీట్!

అందుకే కేసీఆర్ ను మరోసారి గెలిపించారు: సూపర్ స్టార్ కృష్ణ

టీఆరెస్ పార్టీకి సినీ వరల్డ్ నుంచి విషెస్ వెల్లువ!

టీఆరెస్ పార్టీ గెలుపుపై నాని ట్వీట్!