తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్ లను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

వీరందరిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు 'ఆగడు' సినిమాలో ఓ యాక్షన్ సీన్ ని స్పూఫ్ చేసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. కేసీఆర్ '2.0' కాదు.. కానీ రజినీకాంత్ కంటే 20.0 రెట్లు, మహేష్ బాబు కంటే 200.0 రెట్లు, చంద్రబాబు నాయుడు కంటే 2000.0 రెట్లు ఎక్కువ' అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్పుడు ఈ వీడియో, ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కేటీఆర్ కూడా ఈ ట్వీట్ పై స్పందించాడు.

ఈ విజయానికి మీరు అర్హులు.. కేటీఆర్ పై మహేష్ ట్వీట్!

అందుకే కేసీఆర్ ను మరోసారి గెలిపించారు: సూపర్ స్టార్ కృష్ణ

టీఆరెస్ పార్టీకి సినీ వరల్డ్ నుంచి విషెస్ వెల్లువ!

టీఆరెస్ పార్టీ గెలుపుపై నాని ట్వీట్!