తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహాకూటమి గెలుస్తుందనుకున్న వారందరికీ తన విజయంతో షాక్ ఇచ్చాడు కేసీఆర్.

ఎన్నికల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే విజయం ఎవరిదనే విషయం తెలిసిపోయింది. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి సెలబ్రిటీలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీని అభినందిస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. ఇప్పటికే  సూపర్ స్టార్ కృష్ణ, హీరో నాని ఇలా సీనియర్, కుర్ర హీరోలందరూ టీఆర్ఎస్ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు మహేష్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా తన అభినందనలు తెలియజేశాడు.

''కేటీఆర్ కి నా అభినందనలు. మీరు కచ్చితంగా ఈ విజయానికి అర్హులు. ప్రజల మనిషిగా ఉండటాన్ని ఇలాగే కొనసాగించు. మీ అందరికీ నా శుభాకాంక్షలు'' అంటూ  రాసుకొచ్చారు.