MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది

Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది

ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలో యువినా పార్థవి పోషిస్తున్న సంపూర్ణ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ కొత్త క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల చేశారు. యువినా అసలు ఎవరో తెలుసా ? ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 29 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Yuvina Parthavi
Image Credit : Asianet News

Yuvina Parthavi

ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (ఏకే 47) సినిమా ప్రమోషన్లు కామెడీ ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వెంకీ, శ్రీనిధి శెట్టి పోషిస్తున్న పాత్రలను పరిచయం చేసిన చిత్రబృందం, తాజాగా మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో యువినా పార్థవి పోషిస్తున్న సంపూర్ణ పాత్రను పరిచయం చేశారు. వినోదభరితంగా రూపొందించిన ఈ గ్లింప్స్ సినిమా కుటుంబ నేపథ్యం, పాత్రల మధ్య ఉండే ఆసక్తికరమైన సంబంధాలను తెలియజేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెంకీ కూతురిగా నవ్వులు పూయిస్తున్న యువినా
Image Credit : Asianet News

వెంకీ కూతురిగా నవ్వులు పూయిస్తున్న యువినా

ఈ ప్రమోషనల్ వీడియో వెంకీ, రఘుబాబు కలిసి ఓ ఇంటి గురించి చర్చించడంతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సంపూర్ణ అక్కడికి వచ్చి తాను మరోసారి ప్రేమలో పడ్డాననే ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది. అప్పటికే ఏదో జరగబోతోందని ఊహించిన వెంకీ, ఈసారి ప్రేమలో పడింది కారు మెకానిక్ తోనా అని అడుగుతాడు. అందుకు సంపూర్ణ అవునని చెప్పడంతో అతడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ప్రేమ గురించి ఆమె చెప్పే అతిశయోక్తితో కూడిన డైలాగ్‌తో తండ్రి పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. చివర్లో వచ్చే ఆసక్తికరమైన టైటిల్ కార్డ్ ఆ కుటుంబం ఆలోచనా విధానాన్ని చమత్కారంగా తెలియజేస్తుంది.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Related image2
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
35
అంచనాలు పెంచుతున్న గ్లింప్స్ లు
Image Credit : Asianet News

అంచనాలు పెంచుతున్న గ్లింప్స్ లు

సాధారణ క్యారెక్టర్ పరిచయంలా కాకుండా, ఈ గ్లింప్స్ సినిమా కుటుంబంలోని విభిన్నమైన వ్యక్తిత్వాలను, ప్రతి ఒక్కరి వల్ల ఏర్పడే గందరగోళాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి క్యారెక్టర్ గ్లింప్స్, అంతకుముందు పరిచయం చేసిన పాత్రలకు కొనసాగింపుగా ఉండటంతో సినిమా ఏ తరహా వినోదాన్ని అందించబోతోందనే విషయంపై ఆసక్తి పెరుగుతోంది. మొత్తంగా చూస్తే, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా సంఘటనలతో ఈ సినిమా సంపూర్ణమైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.

45
నటీనటులు
Image Credit : Asianet News

నటీనటులు

ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.

55
ఇంతకీ యువినా ఎవరో తెలుసా ?
Image Credit : Asianet News

ఇంతకీ యువినా ఎవరో తెలుసా ?

వెంకటేష్ కూతురిగా నటిస్తున్న యువినా పార్థవి గురించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఆమె తెలుగు కుటుంబంలో చెన్నైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఏవిఎం ప్రొడక్షన్స్ వారి 'ఉరవుక్కు కై కోడుప్పం' టీవీ సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఈ సీరియల్ డైరెక్టర్ భువనేశ్.. యువినా తన తండ్రితో ఓ టూర్ లో ఉండగా చూసి ఎంపిక చేశారు. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. తలా అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ వీరమ్.. యువినాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నాజర్ మనవరాలిగా నటించింది. అజిత్, యువినా మధ్య సీన్లు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ కూతురిగా ఛాన్స్ కొట్టేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Recommended image2
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved