MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌

Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌

బద్దం భాస్కర్‌ అంటూ `అత్తారింటికి దారేది`లో ఓ పాత్రని పెట్టి దర్శకుడు విజయ భాస్కర్‌పై సెటైర్లు పేల్చారని త్రివిక్రమ్‌పై కామెంట్స్ ఉన్నాయి. దీనికి దర్శకుడు విజయబాస్కర్‌ స్పందించి కౌంటర్‌ ఇచ్చారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 29 2026, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మాటలతో పాపులర్‌ అయిన త్రివిక్రమ్‌
Image Credit : facebook/@trivikramsrinivas

మాటలతో పాపులర్‌ అయిన త్రివిక్రమ్‌

స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. తనదైన మాటలతో మాయ చేస్తుంటారు. అందుకే ఆయన్ని మాటల మాంత్రికుడు అంటుంటారు. ఆయన సినిమాల్లో డైలాగులే హైలైట్‌గా నిలుస్తాయి. హార్ట్ టచ్‌ చేస్తాయి. ఆలోచింప చేస్తాయి. అదే ఆయన స్పెషాలిటీ. అసిస్టెంట్‌ రైటర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ప్రారంభంలో పోసాని కృష్ణమురళీ వద్ద పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు విజయ భాస్కర్‌ వద్ద పనిచేశారు. అసిస్టెంట్‌గా పనిచేయడంతోపాటు కథ, మాటలు అందించారు. చాలా సినిమాలకు డైలాగ్స్ రాశారు. వాటి ద్వారానే పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
త్రివిక్రమ్‌ రూపొందించిన హిట్‌ చిత్రాలు
Image Credit : Instagram

త్రివిక్రమ్‌ రూపొందించిన హిట్‌ చిత్రాలు

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. `నువ్వే నువ్వే` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. `అతడు`, `జల్సా`, `ఖలేజా`, `జులాయి`, `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అ ఆ` చిత్రాలతో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`, `గుంటూరు కారం` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు వెంకటేష్‌తో `ఆదర్శకుటుంబం హౌస్‌ నెం.47` మూవీని రూపొందిస్తున్నారు. నెక్ట్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు.

Related Articles

Related image1
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Related image2
YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా
35
విజయ భాస్కర్‌, త్రివిక్రమ్ హిట్‌ కాంబినేషన్‌
Image Credit : Asianet News

విజయ భాస్కర్‌, త్రివిక్రమ్ హిట్‌ కాంబినేషన్‌

అయితే రైటర్‌గా చాలా సినిమాలకు పనిచేశారు త్రివిక్రమ్‌. చాలా వరకు దర్శకుడు విజయభాస్కర్‌ సినిమాలకు కథ, మాటలు అందించారు. వీరి కాంబినేషన్‌లో `స్వయంవరం`, `నువ్వే కావాలి`, `నువ్వు నాకు నచ్చావ్‌`, `మన్మథుడు`, `మళ్లీశ్వరి`, `జై చిరంజీవా` వంటి చిత్రాలు వచ్చాయి. ఈ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్‌ బస్టర్స్. ఒక్క `జై చిరంజీవా` తప్ప. అప్పట్లో విజయ భాస్కర్‌ స్టార్‌ డైరెక్టర్‌ కూడా. ఆ తర్వాత వీరిద్దరు పనిచేయలేదు. త్రివిక్రమ్‌ సొంతంగా దర్శకుడిగా మారడంతో వీరి బాండింగ్‌ బ్రేక్‌ అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, దీంతోనే విడిపోయారని, ఈ క్రమంలోనే `అత్తారింటికి దారేది`లో బద్దం భాస్కర్‌ పాత్రతో విజయ భాస్కర్‌పై సెటైర్లు వేశారనే కామెంట్స్ బయటకు వచ్చాయి. ట్రోల్స్ కూడా నడిచాయి.

45
ట్రోల్స్ పై దర్శకుడు రియాక్షన్‌
Image Credit : Asianet News

ట్రోల్స్ పై దర్శకుడు రియాక్షన్‌

`అత్తారింటికి దారేది`లో బద్దం భాస్కర్‌గా బ్రహ్మానందం నటించారు. ఆయన పాత్ర కామెడీగా ఉంటుంది. ఆయన్ని హీరో ఆడుకునేలా ఉంటుంది. అయితే ఆ పాత్ర దర్శకుడు విజయభాస్కర్‌ దే అనేది చాలా మంది వాదన. దీనిపై తాజాగా దర్శకుడు విజయ భాస్కర్‌ స్పందించారు. ఇలాంటివి చిల్లర కామెంట్స్ చాలా మంది చేస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్నవాటికి రియాక్ట్ అయితే మన స్థాయి తగ్గిపోతుందని తెలిపారు. తాము గురువు, శిష్యులం కాదు అని, మంచి స్నేహంగానే ఉంటామని, రైటింగ్‌ విషయంలో పెద్దా, చిన్నా అనే తేడా ఉండదని, ఇద్దరం కలిసే రాస్తామని, స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయబేధాలుంటాయి, కానీ అది సినిమాకే పరిమితం, వ్యక్తిగతంగా ఎలాంటి ఇష్యూస్‌ లేవని చెప్పారు. వారిది మంచి ఫ్యామిలీ అని కూడా వెల్లడించారు దర్శకుడు.

55
త్రివిక్రమ్‌ నాన్న పేరు భాస్కర్‌
Image Credit : sumantv

త్రివిక్రమ్‌ నాన్న పేరు భాస్కర్‌

బద్దం భాస్కర్‌ అనే విషయానికి వస్తే.. భాస్కర్‌.. త్రివిక్రమ్‌ నాన్న పేరు అని, ఆయన ఆ పేరునే పెట్టుకున్నారని, అదే సమయంలో తమ నాన్న పేరు శ్రీనివాస్‌ అని చెప్పారు దర్శకుడు విజయభాస్కర్‌. క్రియేటివ్‌ సైడ్‌ ఎవరికి ఉండాల్సిన రెస్పెక్ట్ వాళ్లకి ఉంటుందన్నారు. `జై చిరంజీవా` తర్వాత ఇద్దరం కలిసి పనిచేయలేదని, ఆయన కెరీర్‌ పరంగా బిజీ అయ్యారని, ఆ సమయంలో  ఆయన్ని అడగడం కరెక్ట్ కాదు. ఒకవేళ అడిగినా, ఆయన తన కెరీర్‌ని పక్కన పెట్టి రావాలి. అందుకే తాను అడగలేదని చెప్పారు. త్రివిక్రమ్‌ మంచి స్థాయికి వెళ్తాడని తాను ముందుగానే ఊహించానని, ఆ సమయంలో తన కెరీర్‌పై చాలా ఫోకస్డ్ గా ఉండేవాడని, రైటర్‌గా సినిమాలకు పనిచేసినా, తన పేరు రైటర్‌గా వేయోద్దని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానే వేయాలని చెప్పేవాడు. రైటర్‌గా వేస్తే, దర్శకుడిగా సినిమాలు ఇవ్వరు, అందుకే ఆ జాగ్రత్త పడేవాడని తెలిపారు. కెరీర్‌ బిగినింగ్‌లోనే పెద్ద హీరోలతో సినిమాలు కుదిరాయి, అవి బాగా ఆడాయి, దీంతో త్రివిక్రమ్‌ లైఫ్‌ మారిపోయిందని చెప్పాడు దర్శకుడు. గతంలో ఓ ఇంటర్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు విజయ భాస్కర్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut: నువ్వొక యూజ్‌లెస్‌.. పనిచూసుకో, కంగనా రనౌత్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది, ఎవరికో తెలుసా?
Recommended image2
YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా
Recommended image3
Kangana Ranaut: జెన్‌జీ నిరసనకారులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన బాలీవుడ్ స్టార్స్ !
Related Stories
Recommended image1
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Recommended image2
YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved