కారు నడుపుతూ చనిపోయారా..? నమ్మలేకపోతున్నా: దర్శకేంద్రుడు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 29, Aug 2018, 5:15 PM IST
raghavendra rao condolences to harikrishna
Highlights

నందమూరి హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. నందమూరి కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు

నందమూరి హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. నందమూరి కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇండస్ట్రీ హీరోలు, దర్శకుడు, నిర్మాతలు ఇలా అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వారు ఎన్టీఆర్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే హరికృష్ణ మరణాన్ని నమ్మలేకపోతున్నానని అంటున్నాడు దర్శకేంద్రడు రాఘవేంద్రరావు.

''హరికృష్ణ లారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎన్టీఆర్ కు రథసారధిగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రచార రథాన్ని నడిపించారు. అలాంటి వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ మృతి చెందడం దురదృష్టకరం. ఎన్టీఆర్ తో నేను తెరకెక్కించిన 'డ్రైవర్ రాముడు' చిత్రానికి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.

ఎప్పుడు కలిసినా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. నందమూరి కుటుంబ సభ్యులందరితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విషాద సమయంలో వారికి సానుభూతి తెలియజేస్తున్నాను'' అని తెలిపారు. 

ఇవి కూడా చదవండి.. 

తారక్ అన్న.. నీ గురించే ఆలోచిస్తున్నాం: విజయ్ దేవరకొండ ట్వీట్!

తాతయ్య అడిగిందే తడవు 990 కిమీలు నడిపారు: హరికృష్ణపై కల్యాణ్ రామ్

loader