Asianet News TeluguAsianet News Telugu

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ కి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

special surprise for ntr fans
Author
Hyderabad, First Published Oct 5, 2018, 8:55 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ కి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తీసిపోని విధంగా సినిమా ఉంటుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకముందే తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది.

ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో ఆయన కుమారుడు అభయ్ రామ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం చాలా సీక్రెట్ గా ఉంచుతోందని సమాచారం.

అయితే అభయ్ రామ్ తెరపై ఎక్కువ సమయం మాత్రం కనిపించడట. కానీ అభయ్ ని స్క్రీన్ మీద చూడడం అభిమానులకు త్రిల్లింగ్ గా ఉంటుందనే చెప్పాలి. హారికా హాసిని క్రియేషన్స్ బేనర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

Follow Us:
Download App:
  • android
  • ios