సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాపై స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడని ఫిలిం వర్గాల ద్వారా తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి సినిమాకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నాడట. 

దానికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు 26 వ సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయాల్సివుంది. కానీ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ కావడంతో తెలివిగా తన లిస్టు నుండి త్రివిక్రమ్ ని పక్కన పెట్టేశాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ కి బదులుగా సుకుమార్ తో సినిమా చేయాలనుకున్నాడు.

ఈ మేరకు సుకుమార్ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. అయితే 'అరవింద సమేత'తో త్రివిక్రమ్ గనుక మంచి హిట్ అందుకుంటే అతడితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు.

సుకుమార్ సినిమా పూర్తి చేసి ఆ తరువాత త్రివిక్రమ్ తో తన 27వ సినిమా ప్లాన్ చేస్తాడు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అడిగి మరీ తెలుసుకుంటున్నట్లు సమాచారం. అలానే ఎన్టీఆర్.. మహేష్ కి మంచి స్నేహితుడు కాబట్టి ఆ కోణంలో కూడా మహేష్ ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నాడని అనుకోవచ్చు!

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!