Asianet News TeluguAsianet News Telugu

విశాల్ 'పందెంకోడి2'పై బ్యాన్!

విశాల్ హీరోగా దర్శకుడు లింగుస్వామి 'పందెంకోడి2' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక ఏరియాలో బ్యాన్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ పైరసీపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

piracy effect: pandemkodi2 seized
Author
Hyderabad, First Published Oct 18, 2018, 2:30 PM IST

విశాల్ హీరోగా దర్శకుడు లింగుస్వామి 'పందెంకోడి2' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక ఏరియాలో బ్యాన్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ పైరసీపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో తమిళ రాకర్స్ వంటి పైరసీ వెబ్ సైట్ నిర్వహకులపై సవాల్ విసిరాడు. సైబర్ క్రైమ్ సహాయంతో చాలా మందిని అరెస్ట్ చేయించాడు. నేడు తన సినిమా రిలీజ్ సంధర్భంగా మరోసారి పైరసీదారులపై ఎటాక్ చేశాడు.

తిరుచ్చి తాంజోర్ థియేటర్ లో పైరసీ చేస్తోన్న కొందరిని పట్టుకొని ఆ థియేటర్ సినిమా ఆటని క్యాన్సిల్ చేయించాడు. అంతేకాదు తిరుచ్చి ఏరియాలో పది థియేటర్లలో ఎక్కడా సినిమాలు వేయకూడదని విశాల్ బృందం ప్రకటించింది.

పైరసీదారుల్ని ప్రోత్సహించే ఇలాంటి చోట సినిమాలు ఆడనివ్వమని అన్నారు. విశాల్ కి కౌంటర్ ఎటాక్ గా 40 థియేటర్లలో ఎగ్జిబిటర్ అసోసియేషన్ 'పందెంకోడి2'పై బ్యాన్ విధించింది. మరి ఈ గొడవ ఎక్కడకి వెళ్లి ఆగుతుందో చూడాలి!

ప్రీమియర్ షో టాక్: పందెం కోడి 2 

పందెం కోడి 2 ట్విట్టర్ టాక్!

విశాల్ కి మళ్లీ దెబ్బ పడుతుందా..?

రామ్ వర్సెస్ విశాల్.. తేడా వస్తే కష్టమే!

Follow Us:
Download App:
  • android
  • ios