అభిమన్యుడు - డిటెక్టివ్ లాంటి హిట్స్ తరువాత విశాల్ నుంచి వచ్చిన చిత్రం పందెం కోడి 2. టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ను సెట్ చేసుకున్న ఈ కోలీవుడ్ హీరో దసరా ఫెస్టివల్ ను బాగానే టార్గెట్ చేశాడు.

అభిమన్యుడు - డిటెక్టివ్ లాంటి హిట్స్ తరువాత విశాల్ నుంచి వచ్చిన చిత్రం పందెం కోడి 2. టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ను సెట్ చేసుకున్న ఈ కోలీవుడ్ హీరో దసరా ఫెస్టివల్ ను బాగానే టార్గెట్ చేశాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్విట్టర్ టాక్ విషయానికి వస్తే.. 

సినిమా కమర్షియల్ ఫార్మాట్ తో వస్తుందని అందరికీ ముందే తెలుసు. అయితే ఆ ఫార్మాట్ ని దర్శకుడు కరెక్ట్ గానే ప్రజెంట్ చేశాడని తెలుస్తోంది. సీక్వెల్ లో పందెం కోడి పాత్రలు అదే ఎమోషన్ ని మెయింటైన్ చేయడం ఆకట్టుకుంటోందట. ఇకపోతే పొగరు సినిమాలోని పోలికలు ఇందులో కనిపిస్తాయి. పర్ఫెక్ట్ సీక్వెల్ ని తనదైన స్క్రీన్ ప్లే తో లింగుస్వామి తెరక్కించాడు. మాస్ సీన్స్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. 

అయితే పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మొదట పందెం కోడిలో సాంగ్స్ ఎంతగా హిట్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ సీక్వెల్ కి మాత్రం యువన్ శంకర్ రాజా ఉహించినంతగా న్యాయం చేయలేకపోయారు. కీర్తి సురేష్ తన పాత్రతో మరోసారి ఆకట్టుకుంది. పందెం కోడి 2 ఈ ఫెస్టివల్ లో ఒక మంచి మాస్ ఎంటర్టైనర్. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ప్రీమియర్ షో టాక్: పందెం కోడి 2

పందెం కోడి 2 ట్విట్టర్ టాక్!

విశాల్ కి మళ్లీ దెబ్బ పడుతుందా..?

రామ్ వర్సెస్ విశాల్.. తేడా వస్తే కష్టమే!