Asianet News TeluguAsianet News Telugu

ప్రీమియర్ షో టాక్: పందెం కోడి 2

13 ఏళ్ల క్రితం వచ్చిన  పందెం కోడి కోడి సినిమా  ఏస్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విశాల్ కెరీర్ కు ఒక్కసారిగా ఊపునిచ్చిన ఆ సినిమా డైరెక్టర్ లింగుస్వామిని కూడా స్టార్ డైరెక్టర్ చేసింది

pandhem kodi preamiar show talk
Author
Hyderabad, First Published Oct 18, 2018, 6:44 AM IST

13 ఏళ్ల క్రితం వచ్చిన  పందెం కోడి కోడి సినిమా  ఏస్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విశాల్ కెరీర్ కు ఒక్కసారిగా ఊపునిచ్చిన ఆ సినిమా డైరెక్టర్ లింగుస్వామిని కూడా స్టార్ డైరెక్టర్ చేసింది. తెలుగులో కూడా విశాల్ కి మంచి మార్కెట్ ను సెట్ చేసింది. 

ఇక ఇప్పుడు మళ్ళీ అదే సినిమాకు సీక్వెల్ ను రిలీజ్ చేశారు. దసరా సందర్బంగా రెండు భాషల్లో భారీగా రిలీజ్ చేయడంతో పండగ సీజన్ లో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా రొటీన్ కమర్షియల్ సినిమాల మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ - రెండు వర్గాల మధ్య గొడవలు అదే ఫార్మాట్ లో లింగుస్వామి సినిమాను తెరక్కించాడు.కాకపోతే స్క్రీన్ ప్లే లో కొంత ప్రయోగాలు చేశాడని చెప్పవచ్చు. 

చెన్నైలో ముందుగానే సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. చాలావరకు సినిమాకు పరవాలేదు అనేవిధంగా టాక్ వస్తోంది. మొదటి పార్ట్ లో అలరించిన పాత్రలు సెకండ్ పార్ట్ లో కూడా అంతే స్థాయిలో అలరించాయి. అయితే సాంగ్స్ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. బి - సి సెంటర్లలో ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పవచ్చు. 

సినిమాలో మాస్ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. విశాల్ - కీర్తి సురేష్ లవ్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోరింగ్ గా అనిపించవచ్చు కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా మాస్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ పండగ సీజన్ లో సినిమాపై పెద్దగా అంచనాలు పెంచుకోకుండా వెళితే ఒక మాస్ ఎంటర్టైనర్ ను చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే బి-సి సెంటర్లలో కాకుండా మిగతా వారికీ సినిమా ఎంతవరకు నచ్చుతుందనేది చెప్పలేము.     

 

ప్రీమియర్ షో టాక్: పందెం కోడి 2 

పందెం కోడి 2 ట్విట్టర్ టాక్!

విశాల్ కి మళ్లీ దెబ్బ పడుతుందా..?

రామ్ వర్సెస్ విశాల్.. తేడా వస్తే కష్టమే!

Follow Us:
Download App:
  • android
  • ios