పండగ సీజన్స్ వస్తే చాలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటాయి. హాలిడేస్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే పెట్టుబడి మొత్తం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక తరువాత కొంచెం నడిచినా మిగతా కలెక్షన్స్ అన్ని బోనస్ లు.

పండగ సీజన్స్ వస్తే చాలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటాయి. హాలిడేస్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే పెట్టుబడి మొత్తం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక తరువాత కొంచెం నడిచినా మిగతా కలెక్షన్స్ అన్ని బోనస్ లు. ఇక ఇప్పుడు దసరాను టార్గెట్ గా చేసుకొని రెండు సినిమాలు రానున్నాయి. రీసెంట్ గా అరవింద సమేత కొంచెం ముందుగా వచ్చిన సంగతి తెలిసిందే. 

మంచి ఓపెనింగ్స్ అందుకొని సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. అయితే కొంత మిక్సిడ్ టాక్ సినిమా కలెక్షన్స్ కి అడ్డు తలిగే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రామ్ - విశాల్ కూడా దసరా బరిలో పోటీ పడనున్నారు. రామ్ - త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో హలో గురు ప్రేమకోసమే 18న రానుంది. అదే రోజు విశాల్ - పందెం కోడి 2 కూడా రానుంది. 

అయితే అందరి చూపు మాత్రం ఎక్కువగా విశాల్ సినిమాపైనే ఉంది. పందెం కోడితోనే విశాల్ తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. దీంతో దానికి సీక్వెల్ గా వస్తున్న సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే రామ్ గత చిత్రాలు చాలా వరకు నీరాశపరిచాయి. ఇక హలో గురు ప్రేమ కోసమేకు బజ్ కూడా ఎక్కువగా లేదు. ట్రైలర్ కూడా పెద్దగా వైరల్ అవ్వలేదు. 

పైగా త్రినాద్ రావు రెగ్యులర్ కథలను మాత్రమే చూపిస్తాడని కొంత టాక్ ఉంది కాబట్టి సినిమాకు రిలీజ్ తరువాత గాని రిజల్ట్ ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టమే. దసరా రేస్ లో రామ్ గట్టిగా పోటీని ఇస్తేనే నిలదొక్కుగోగలడు కొంచెం తేడా వచ్చినా కష్టమే. ఇక విశాల్ సినిమాకు కాస్త సక్సెస్ అని రెస్పాన్స్ వచ్చినా అందరిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. మరి రామ్ - విశాల్ పోటీలో ఎవరు ఎక్కువగా సక్సెస్ అందుకుంటారో చూడాలి.