ఒక ప్రక్క పాలిటిక్స్ లో చురుకుగా పాల్గొంటూనే మరో ప్రక్క వరస సినిమాలు కమిట్ అవుతూ.. ఫ్యాన్స్ ని, ప్రేక్షకుల్ని ఖుషీ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సాధ్యమైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ యమ స్పీడ్ గా షూటింగ్ లు  చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తోన్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. మరో పక్క క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు.

క్రిష్ సినిమాకు సంభందించి లేటెస్ట్ అప్ డేట్ కు వెళితే.. ఈ చిత్రం మార్చి 4 నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో కొన్ని యాక్షన్ ఎపిసొడ్స్  షూట్ చేసారని తెలిసింది.  పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్  గతంలో ఎప్పుడూ చేయని డిఫరెంట్  క్యారెక్టర్ లో కనిపించనున్నారని చెప్తున్నారు. అంతేకాదు.. లుక్ పరంగా, గెటప్ వైజ్,  స్టైలిష్ గా పవన్ని చూపించబోతున్నారు  డైరెక్టర్ క్రిష్..!! ఈ సినిమాలోంచి ఓ స్టిల్ లీకై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. ఈ ఫొటోలో పవన్ ..నుదటి మధ్యలో ఓ నామం పెట్టుకుని ఉన్నారు. అలాగే గ్లామర్ తో వెలిగిపోతున్నారు.
 
మొఘల్ రాజవంశం యొక్క నేపథ్యాన్ని కలిగి ఉన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక దొంగ పాత్రను పోషిస్తున్నట్లుగా చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరును ‘వీరా’ అని లాక్ చేసి... సినిమా టైటిల్ ‘విరూపాక్ష’  అని పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ‘విరూపాక్ష’ టైటిల్ అయితే ఈ కథకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని అంటున్నారు.

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పడవ సెట్స్‌లో షూట్ చేయబోతున్నారు. ఇందులో నటించే హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. వీటితోపాటు హరీష్‌శంకర్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు పవన్‌.