సినీ నటుడు, మాజీ పార్లెమెంట్ సభ్యులు హరికృష్ణ ఆగస్టు 29న నల్గొండ ప్రాంతంలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆఖరిగా హరికృష్ణ తనతో మాట్లాడిన మాటలు వెల్లడించారు.

''ఆగస్టు 27న హరికృష్ణకి ఫోన్ చేసి ఆగస్టు 30న నా మనవరాలి పెళ్లి నువ్ వచ్చి అక్షింతలు వేస్తే.. అన్నగారు వచ్చి అక్షింతలు వేసినట్లు భావిస్తానని అడిగితే.. సారీ రాలేను. ఒకరికి మాటిచ్చాను. ఆగస్టు 29న ఉదయాన్నే కావలి వెళ్తున్నా.. 30వ తేదీకి ఇక్కడకి రాగలనో లేదో తెలియదు అన్నారు. కనీసం 31న వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించమని అడిగితే మళ్లీ రాలేను అన్నారు.

ఆయన నుండి రాలేను అనే శబ్దం ఎప్పుడూ వినలేదు. మొదటిసారి విన్నాను. అప్పుడు ఆగస్టు 27న ఉదయం పెళ్లికూతుర్ని చేస్తున్నాం. వచ్చి అక్షింతలు వేస్తావా..? అని అడిగితే వస్తాను అన్నారు. కానీ నేను ఆ సమయంలో నేను పెళ్లికొడుకు దగ్గరకు వెళ్లగా.. హరికృష్ణ అప్పటికే వచ్చి అక్షింతలు వేసి బయలుదేరబోతుంటే.. నా కూతరు నాన్నగారు వచ్చేస్తారు ఉండడని అడిగిందట.

కానీ అయన వెళ్లానని చెప్పండని వెళ్లిపోయారు. నేను వెంటనే ఫోన్ చేసి రెండు నిమిషాలు ఆగు హరి వచ్చేస్తున్నా.. అంటే టైమ్ లేదు.. వెళ్లిపోతున్నా.. అన్నారు'' అంటూ హరికృష్ణ తనతో ఆఖరిగా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 

ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ జయంతి.. విషాదంలో అభిమానులు!

ఫ్యాన్స్ కి హరికృష్ణ ఆఖరి లేఖ ఇదే!

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..