ఫ్యాన్స్ కి హరికృష్ణ ఆఖరి లేఖ ఇదే!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 29, Aug 2018, 10:28 AM IST
harikrishna's last letter to fans
Highlights

నందమూరి హరికృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఆయన మృత్యువాతతో సినిమా రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు.

నందమూరి హరికృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఆయన మృత్యువాతతో సినిమా రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో 62వ పుట్టినరోజు జరుపుకోనున్నహరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖను సిద్ధం చేశారు. ఆ లేఖలో ఏముందంటే..

'సెప్టెంబర్ 2న నా అరవైవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలో కొన్ని జిలాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. అందుచేత నా పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్షీలు ఏర్పాటు చేయకండి..

పుష్పగుచ్చాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చుని వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. నిరాశ్రయులైన వారికి బట్టలు, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను' అంటూ ఓ లేఖను సిద్ధం చేశారు. ఇది బయటకి రాకమునుపే ఆయన మరణించడం బాధను కలిగిస్తోంది. 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..

క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకున్న హరికృష్ణ

హరికృష్ణ మృతదేహం వద్ద బోరున విలపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

 

loader