నందమూరి అభిమానులు ప్రతి ఏడాది ఈరోజున హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆయన మరణంతో విషాదంలో మునిగిపోయారు. 

నందమూరి అభిమానులు ప్రతి ఏడాది ఈరోజున హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆయన మరణంతో విషాదంలో మునిగిపోయారు. పుట్టినరోజుకి మూడు రోజుల ముందే ఆయన చనిపోవడం బాధాకరం. ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.

హరికృష్ణ చివరిగా రాసిన లేఖలో తన పుట్టినరోజు నాడు అభిమానులను వేడుకలకు దూరంగా ఉండమని, ఆ డబ్బుని కేరళ వరద బాధితుల సహాయం కోసం ఉపయోగించాలని కోరారు. ఆయన కోరిక మేరకు అభిమానులు ఆ దిశగా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కాగా నేడు హరికృష్ణ జయంతి సందర్భంగా.. ఆయన అభిమానులు హరికృష్ణ విగ్రహాన్ని రూపొందించారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు ఆయన విగ్రహాన్ని రూపొందించారు. ఈరోజు హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ విగ్రహాన్ని ఆయన చిన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కి అందించనున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

ఫ్యాన్స్ కి హరికృష్ణ ఆఖరి లేఖ ఇదే!

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..