comscore

Entertainment

Bigg Boss Telugu 8: Pritviraj's Bold Stand Against Vishnu Priya
Video Icon

హ్యాండ్ ఇచ్చిన పృథ్వీ కుమిలిపోతున్న విష్ణుప్రియ

బిగ్ బాగ్ తెలుగు సీజన్‌ 8 హౌస్‌లో ఇంట్రస్టింగ్‌ పరిణామం చోటు చేసుకుంది. విష్ణు ప్రియకు పెద్ద హ్యాండిచ్చేశాడు పృథ్విరాజ్.  నామినేషన్స్‌లో ఈసారి వీరిద్దరినీ టార్గెట్ చేయడంతో యష్మి పృథ్వీని హెచ్చరించింది. మరీ ఓవర్ అయిపోతుంది అంటూ విష్ణు ప్రియను విమర్శించింది. అయితే, ఈ విషయంలో నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని యష్మి పృథ్వీని అడిగింది. అదేం లేదని, తానేమీ విష్ణుప్రియ దగ్గరకు వెళ్ళడం లేదని చెప్పాడు. ఆమె స్వయంగా తన దగ్గరకు వస్తుందంటూ పృధ్వీ తేల్చేశాడు. అంతేకాదు విష్ణు ప్రియను కూడా కూర్చోబెట్టి పృథ్వీ చెప్పేశాడు. నేను ముందే చెప్పాను కదా.. నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నేను సింగిల్ అని.. మనం ఏమైనా ఓవర్ అవుతున్నామేమో చూసుకో అని చెప్పేశాడు. దాంతో విష్ణుప్రియ అయిష్టంగానే అదేం లేదు అని ఆన్సర్ చేసింది.  తరువాత ఓంటరిగా బాధపడుతున్న విష్ణును నబిల్ ఓదార్చాడు.