MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `షష్టిపూర్తి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రాజేంద్రప్రసాద్‌, ఇళయరాజా పని చేసిన మూవీ సక్సెస్‌ అయ్యిందా?

`షష్టిపూర్తి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రాజేంద్రప్రసాద్‌, ఇళయరాజా పని చేసిన మూవీ సక్సెస్‌ అయ్యిందా?

రాజేంద్రప్రసాద్‌, అర్చన, రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `షష్టిపూర్తి`. ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

4 Min read
Author : Aithagoni Raju
Published : May 30 2025, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
`షష్టిపూర్తి` మూవీ రివ్యూ
Image Credit : X/movie production

`షష్టిపూర్తి` మూవీ రివ్యూ

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `షష్టిపూర్తి`. ఆయనకు జోడీగా సీనియర్‌ నటి అర్చన నటించారు. రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లుగా మా ఆయి ప్రొడక్షన్‌ పతాకంపై రూపేష్‌ నిర్మించారు. దీనికి మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. 

కీరవాణి ఓ పాట కూడా రాశారు. పవన్‌ ప్రభ దర్శకత్వం వహించి ఈ మూవీ నేడు శుక్రవారం(మే 30న) విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`షష్టిపూర్తి` కథ ఏంటంటే?
Image Credit : X/movie production

`షష్టిపూర్తి` కథ ఏంటంటే?

శ్రీరామ్‌ (రూపేష్‌) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తుంటాడు. నీతి, నిజాయితీకి మారుపేరు. అవన్నీ తన అమ్మ భువనేశ్వరి(అర్చన) నుంచి వచ్చాయి. కేసుల విషయంలోనూ ఇదే నీతి, నిజాయితీ ఫాలో అవ్వడం, తాను ఉండే వీధుల్లోనూ అలానే ఉండటంతో ఆయనకు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు, అందరు శతృవుగానే చూస్తుంటారు. 

ఈ క్రమంలో ఓ రోజు జానకి(ఆకాంక్ష సింగ్‌) అనే అమ్మాయి రౌడీల నుంచి కాపాడుకునే క్రమంలో శ్రీరామ్ ఇంటికి వచ్చి తలదాచుకుంటుంది. ఆ సమయంలో ఆమె తన కష్టాన్ని పంచుకుంటుంది. ఓ రౌడీ తన భూమిని కౌలుకు తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని, ఇప్పుడు భూమి కూడా తనదే అని బెదిరిస్తున్నాడని చెబుతుంది.

 తొలి చూపులోనే ఆమెకి ఫిదా అయిన శ్రీరామ్‌ జానకికి సహాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. విలన్‌పై కేసు వేసి కోర్ట్ లో న్యాయం కోసం పోరాడాలనుకుంటాడు. కానీ ఆ దారిలో పని అవదని, ఈ గొడవని వదిలేయాలని జానకి చెబుతుంది. 

దీంతో  డైరెక్ట్ గా వెళ్లి విలన్‌ని కొట్టి జానకి భూమి పత్రాలు తెచ్చి ఆమెకిస్తాడు. శ్రీరామ్‌ ధైర్య సాహసాలకు జానకి కూడా ఫిదా అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. డ్యూయెట్లు పాడుకుంటారు. కానీ శ్రీరామ్‌ రియాలిటీ ఏంటో జానకికి తెలియడంతో ఇలా నీతి నిజాయితీ అంటే తనని పోషించడం కష్టమని, కొన్నిసార్లు అబద్దాలు చెప్పడం, తప్పులు చేయడంలో తప్పులేదని చెబుతుంది.

 అలా ఉంటేనే తాను పెళ్లి చేసుకుంటాననే కండీషన్‌ పెడుతుంది. మరి ఆమె కోసం శ్రీరామ్‌ మారాడా? జానకి కోసం ఆయన ఏం చేశాడు? తన కొడుకు నీతికి, నిజాయితీకి మారు పేరు అని, చాలా మంచి వాేడు అని నమ్మే శ్రీరామ్‌ తల్లికి ఈవన్నీ తెలిస్తే ఆమె రియాక్షన్‌ ఏంటి? శ్రీరామ్‌ తల్లి తన తండ్రి దివాకర్(రాజేంద్రప్రసాద్‌)కి ఎందుకు విడాకుల నోటీసులు పంపింది? వాళ్ల గొడవ ఏంటి? ఇంతకి జానకి ఎవరు? ఆమె వేసిన ప్లాన్‌ ఏంటి? అంతిమంగా షష్టిపూర్తి ఎలా జరిగింది? అనేది అసలు కథ.

36
`షష్టిపూర్తి` మూవీ విశ్లేషణ
Image Credit : X/movie production

`షష్టిపూర్తి` మూవీ విశ్లేషణ

`షష్టిపూర్తి` అనే టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ కేవలం పేరెంట్స్ కి షష్టిపూర్తి చేయడం అనే యాంగిల్‌లోనే సాగదు. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి. నీతి, నిజాయితీ ఉంటుంది. కుట్రలు ఉంటాయి, అపర్థాలు ఉంటాయి, మోసాలుంటాయి. ఇలా అన్ని రకాల కమర్షియల్‌ అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో ఉంటుంది.

 ఇటీవల కాలంలో హీరోలంతా విలన్‌గా ప్రవర్తిస్తున్నారు, అన్నిరకాల బ్యాడ్‌ హ్యాబిట్స్ ఉంటాయి. అలా ఉంటేనే హీరోయిజంగా భావిస్తున్నారు. అలాంటి చిత్రాలనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ దానికి భిన్నంగా హీరో నీతి, నిజాయితీగా ఉంటే, సమాజంలో, చివరికి ప్రేమించిన అమ్మాయి కూడా లోకువగా చూసే పాయింట్‌ని ఇందులో టచ్‌ చేయడం బాగుంది. ఒక ఛేంజోవర్ లాగా ఉంటుంది. ప్రస్తుత సమాజాన్ని అద్దంపడుతూనే మనిషి ఎలా ఉండాలనేది టచ్‌ చేసిన తీరు కూడా బాగుంది. 

ఇక సినిమాగా చూస్తే ఫస్టాఫ్‌ హీరో మీదనే సాగుతుంది. ఆయన నిజాయితీగా ఉండటం వల్ల జరిగిన మంచీ, చెడుని కూడా చూపించారు. హీరో పాత్రని ఎస్లాబ్లిష్‌ చేసే ప్రయత్నం చేశారు. అనంతరం హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఆమె కోసం త్యాగాలు చేయడం ఆకట్టుకునేలా ఉంది. అలా కథని ముందుకు సాగడానికి కావాల్సిన ప్రేమ, డ్రామా, యాక్షన్‌ మేళవించి ఫస్టాఫ్‌ నడిపించారు.

46
`షష్టిపూర్తి` లో హైలెట్స్, మైనస్ లు
Image Credit : X/movie production

`షష్టిపూర్తి` లో హైలెట్స్, మైనస్ లు

 సెకండాఫ్‌ని నుంచి కథలో సీరియస్‌ నెస్‌ స్టార్ట్ అవుతుంది. ప్రేమలోని విభిన్న కోణాలు బయటపడతాయి. అదే సమయంలో హీరో మారడం వల్ల చోటు చేసుకునే పరిణామాలు, అప్పటి వరకు దూరంగా ఉన్నవాళ్లు దగ్గర కావడం, అందరికి మంచి వాడిగా కనిపించడం బాగుంది. అయితే అప్పుడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.

 హీరోయిన్‌లోని మరో కోణం బయటపడే సీన్లు, హీరో పేరెంట్స్ లోని ఫ్లాష్‌ బాక్‌ స్టోరీ ఆద్యంతం రక్తికట్టేలా సాగుతాయి. సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ లు, కోర్ట్ రూమ్‌ డ్రామా, ఉత్కంఠకి గురి చేస్తుంది. సీన్ల పరంగా అక్కడక్కడ బాగున్నాయి. రొమాంటిక్‌ సాంగ్‌ బాగుంది. 

అర్చనకి సంబంధించిన ఎమోషనల్‌ సీన్లు మెప్పించేలా ఉంటాయి. రాజేంద్రప్రసాద్‌, అర్చన మధ్య వచ్చే సీన్లు గుండెని బరువెక్కిస్తాయి. అయితే ఆయా సీన్లని మరింత ఎమోషనల్‌గా రాసుకుంటే బాగుండేది. దీనికితోడు హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ కూడా ఇంకా బాగా చేయాల్సింది. 

యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. సినిమాలో డైలాగులు రొటీన్‌గా, రెగ్యూలర్ గా అనిపిస్తాయి. వాటిలో ఏమాత్రం కొత్తదనం లేదు. సినిమాకంటూ ఒక సోల్‌ ఉంటుంది. ఒక ఎమోషన్‌ ఉంటుంది. ఇందులో ఈ అంశాలపై దర్శకుడు బాగా వర్క్‌ చేయాల్సింది. కానీ చివర్లో రాజేంద్రప్రసాద్‌, అర్చనల మధ్య వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.

56
`షష్టిపూర్తి` చిత్రంలోని నటీనటుల ప్రదర్శన
Image Credit : X/movie production

`షష్టిపూర్తి` చిత్రంలోని నటీనటుల ప్రదర్శన

లాయర్‌ శ్రీరామ్‌ పాత్రలో రూపేష్‌ బాగా చేశాడు. నీతి, నిజాయితీ అనే అంశాలకు ఆయన బాగా సూట్‌ అయ్యారు. ఆయన పాత్రలోని వేరియేషన్‌ కూడా బాగుంది. యాక్షన్‌ సీ‌న్లలో అదరగొట్టాడు. అదే సమయంలో రొమాంటిక్‌ సాంగ్‌లోనూ రెచ్చిపోయాడు. సినిమాని ప్రారంభం నుంచి తన భుజాలపై తీసుకెళ్లాడు. 

ఇక జానకి పాత్రలో ఆకాంక్ష సింగ్‌ సైతం బాగా చేసింది. ఆమె పాత్రలోని మరో షేడ్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. రెండు రకాలుగానూ ఆమె బాగా చేసింది. రాజేంద్రప్రసాద్‌ గురించి చెప్పడానికి ఏముంది, ఇలాంటి పాత్రలు దొరికితే రెచ్చిపోతారు. ఇందులోనూ అదే చేశాడు. క్లైమాక్స్ సీన్లలో, ఫ్లాష్‌ బాక్‌ సీన్లలో ఆయనేంటో చూపించారు. 

సీనియర్‌ నటి అర్చనకు కూడా బలమైన పాత్ర దక్కించింది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఆద్యంతం రక్తికట్టిస్తుంది. రాజేంద్రప్రసాద్‌ స్నేహితుడిగా ఆనంద చక్రపాణి బాగా చేశాడు. ఆయన పాత్రలో ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. అచ్యుత్‌ కుమార్‌, చలాకీ చంటి, మురళీధర్‌ గౌడ్‌ వంటి మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

66
`షష్టిపూర్తి` మూవీ టెక్నీకల్‌ టీమ్‌ పనితీరు, రేటింగ్‌
Image Credit : X/movie production

`షష్టిపూర్తి` మూవీ టెక్నీకల్‌ టీమ్‌ పనితీరు, రేటింగ్‌

 సినిమా టెక్నీకల్‌గా బాగుంది. ఇళయరాజా సంగీతం పెద్ద అసెట్‌. ఆయన పాటలు బాగున్నాయి. అలరించేలా ఉన్నాయి. షష్టిపూర్తి సాంగ్‌ ఆద్యంతం కనువిందు చేస్తుంది. కీరవాణి, చైతన్య ప్రసాద్‌, రెహమాన్‌ పాటల సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది. బీజీఎం సైతం వాహ్‌ అనిపిస్తుంది. 

రామ్‌ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటర్‌ కార్తీక శ్రీనివాస్‌ ఇంకా తన కత్తెరకి పని చెప్పాల్సింది. ఇక దర్శకుడు పవన్‌ ప్రభ చెప్పాలనుకున్న పాయింట్‌ బాగుంది. కానీ దాని కోసం లాగడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. 

టైటిల్‌ షష్టిపూర్తి అని చెప్పి దాన్ని క్లైమాక్స్ కే పరిమితం చేయడం కొంత లోటుగా అనిపిస్తుంది. ఎమోషనల్‌గా కొన్ని సీన్లు బాగా రాసుకున్నాడు. కానీ కథ పరంగానూ, కథనం పరంగానూ, డైలాగ్‌ల పరంగానూ ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. అమ్మానాన్న విడిపోవాలనుకోవడం, వారిని కలిపేందుకు హీరో ప్రయత్నించడం వంటి అంశాలు బాగున్నాయి. 

హీరోనే నిర్మాత కావడంతో సినిమాని రాజీపడకుండా నిర్మించారు. ఆ క్వాలిటీ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. అంతేకాదు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల విషయంలోనూ ఆ గ్రాండియర్‌ నెస్‌ కనిపిస్తుంది.

ఫైనల్‌గాః `షష్టిపూర్తి` ఫ్యామిలీ అంతా చూడగలిగే మూవీ.

రేటింగ్‌ః 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image3
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Related Stories
Recommended image1
కమల్‌ హాసన్‌కి బిగ్‌ షాక్‌, `థగ్‌ లైఫ్‌` బ్యాన్‌ చేస్తూ సంచలన నిర్ణయం
Recommended image2
`భైరవం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ హిట్‌ కొట్టారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved