MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ కోసం సూర్యతో సినిమా వదిలేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

విజయ్ దేవరకొండ కోసం సూర్యతో సినిమా వదిలేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వరుసగా ప్లాప్ లు ఎదురవుతున్నా.. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈక్రమంలో ఓ హీరోయిన్ అయితే విజయ్ దేవరకొండ సినిమా కోసం ఏకంగా సూర్య సినిమానే వదిలేసుకుందట. ఇంతకీ ఎవరా బ్యూటీ.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 30 2025, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : Asianet News

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా తక్కువ టైమ్ లో హీరోగా స్టార్ డమ్ సంపాదించుకున్న విజయ్ కు ఈ మధ్య కాలం కలిసి రావడంలేదు చేసిన ప్రతీ సినిమా ప్లాప్ అవుతోంది. కాని విజయ్ ఇమేజ్, క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సామాన్యులే కాదు స్టార్స్ లో కూడా విజయ్ ను ఇష్టపడేవారు ఉన్నారు. హీరోయిన్లు అయితే విజయ్ తో సినిమా అంటే కళ్లు మూసుకుని ఓకే చెపుతారు. ఇక ఓ స్టార్ హీరోయిన్ విజయ్ తో సినిమా కోసం పెద్ద సినిమానే వదిలేసిందట. ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్.

24
Image Credit : our own

టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేశ్, రీసెంట్ గా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బాలనటిగా తన ప్రయాణాన్ని మలయాళ సినిమాలతో స్టార్ట్ చేసిన కీర్తి, 2015లో తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమై, 2018లో మహానటి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆమెకు జాతీయ ఉత్తమ నటీ అవార్డు ను అందించింది.

Related Articles

Related image1
కీర్తి సురేష్ షాకింగ్ లుక్, బాయ్ కట్ లో మహానటి ఫోటోలు వైరల్
Related image2
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ , కాంతారావు స్మారకం గురించి ఏమన్నాడంటే?
34
Image Credit : our own

ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ భాషల్లో బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నారు. బాలీవుడ్‌లో బేబీ జాన్ సినిమాతో ప్రవేశించినప్పటికీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, కీర్తి సురేశ్ తమిళ స్టార్ హీరో సూర్య 46వ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. దాంతో మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో హీరోయిన్ గా కీర్తీని నటించమని అడిగితే నో చెప్పిందట.

44
Image Credit : our own

విజయ్ దేవరకొండతో చేస్తున్న కొత్త సినిమా కారణంగానే ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించిందనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, కీలక షెడ్యూల్స్ కు కీర్తి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని టాక్. గతంలో సూర్య–కీర్తి కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ జంట మళ్లీ కలిసి పనిచేసే అవకాశం మిస్ అయ్యింది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Related Stories
Recommended image1
కీర్తి సురేష్ షాకింగ్ లుక్, బాయ్ కట్ లో మహానటి ఫోటోలు వైరల్
Recommended image2
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ , కాంతారావు స్మారకం గురించి ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved