Asianet News TeluguAsianet News Telugu

పేరుకు సాంప్రదాయబద్ధమైన హీరోయిన్, కానీ సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు

వెండితెరపై సాంప్రదాయ నటిగా సాధికా వేణుగోపాల్ కి పేరుంది. అలాంటి నటి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నగ్న చిత్రాలు కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. 

nude photos in actress sadhika venugopal instagram account here it is what happen
Author
Hyderabad, First Published Aug 8, 2021, 5:33 PM IST

సినిమా సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్, మహిళా నటులపై ఈ వేధింపులు మరింత ఎక్కువగా ఉంటాయి. తాజాగా మలయాళ నటి సాధికా వేణు గోపాల్ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వెండితెరపై సాంప్రదాయ నటిగా సాధికా వేణుగోపాల్ కి పేరుంది. అలాంటి నటి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నగ్న చిత్రాలు కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. 


సాధికా వేణుగోపాల్ అనే పేరున ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె నగ్న చిత్రాలు దర్శనం ఇచ్చాయి. పరిశ్రమకు చెందిన సన్నిహితులు, స్నేహితులు సాధికా వేణుగోపాల్ కి ఫోన్ చేసి, మీరేంటి ఇలాంటి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారని అడగడంతో...  సాధికా వేణుగోపాల్ షాక్ గురవడంతో పాటు, ఆ అకౌంట్ నాది కాదని తెలియజేశారు. 


ఓ యువకుడు సాధికా పేరుపై నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి, ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. అది నిజంగానే సాధికా వేణుగోపాల్ అకౌంట్ అని భావించిన కొందరు, ఆమెను సంప్రదించడం జరిగింది. విషయం తెలుసుకున్న సాధిక సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీ ఆధారంగా సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే ఆ యువకుడి భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని సాధికా కేసు వాపస్ తీసుకున్నారట. పోలీసులు అతన్ని గట్టిగా మందలించి వదిలేశారని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios