కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మహానటి’. చిత్రీకరణ పనులు ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అలనాటి కథానాయిక సావిత్రి జీవితం ఆధారంగా రూపొందటంతో ఈ చిత్రంపై దక్షిణాది ప్రేక్షకుల్లో తారాస్థాయి కుతూహలం నెలకొంది. అంతేగాక ఇటీవల విడుదలై టీజర్, రెండు పాటలు కూడ బాగుండటంతో ఈ హైప్ మరింతగా పెరిగింది.

ఇకపోతే నిన్ననే రీ రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పాటల్ని ఈరోజు విడుదలచేయనున్నారు. ఈ ఆడియో వేడుకకు స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో మే 9న విడుదలకానున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత వంటి స్టార్ నటీ నటుల నటించారు.