బిగ్ బాస్ హౌజ్ కు ఎవరొచ్చారో తెలుసా.. యంగ్ టైగర్

ntr son abhayram in big boss house and celebrated his birthday
Highlights

  • బిగ్ బాస్ షోలో యంగ్ టైగర్
  • యంగ్ టైగర్ అంటే ఎన్టీఆర్ కాదు
  • యంగ్ టైగర్ అంటే ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో మొదటిరోజు సందడి చేసిన ఎన్టీఆర్ ఆ తరువాత షోలో ఒక్కరోజు కూడా కనిపించలేదు. అయితే ప్రేక్షకులను వారంపాటు వెయిట్ చేయించిన జూనియర్ ఈసారి ఆ వెయిటింగ్ కు తగ్గట్టే.. ఈ వీకెండ్ లో జూనియర్ ఈ షోలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ షోకు సంబంధించిన వీకెండ్ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ఈరోజు ఉదయం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ షూటింగ్ కార్యక్రమానికి ఈసారి జూనియర్ తో అతడి కొడుకు అభయ్ రామ్ కూడా వచ్చాడని.. ఈరోజు అభయ్ రామ్ పుట్టినరోజు కావడంతో జూనియర్ తనతో పాటు ఎన్టీఆర్ వారసుడిని కూడా...  షూటింగ్ స్పాట్ కు తీసుకు వచ్చి.. అక్కడే గ్రాండ్ గా బర్డ్ డే సెలెబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా కేక్ కట్ చేసి నిర్వహించి... షోకు మరింత ఎట్రాక్షన్ తీసుకొచ్చారని తెలుస్తోంది.. 

 

ఈ పుట్టినరోజు  సందర్భంగా తన ముద్దుల కొడుకుకి బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫోటో పోస్టు చేశాడు జూనియర్. బిగ్‌బాస్ లో తాను తన కుమారుడు అభయ్ రామ్‌తో కలిసి ఉన్న ఫోటోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. మరి ఈ వీకెండ్ ప్రసారం అయ్యే షోలో ఈ బుల్లిటైగర్ కూడా కనిపిస్తాడో? లేదో? అనే విషయం పై క్లారిటీ లేదు. 

 

అభయ్ రామ్ వేసుకున్న డ్రెస్సు పై టైగర్ సింబల్ కనిపిస్తోంది. నందమూరి వంశంలో నాల్గవ తరానికి చెందిన అభయ్ రామ్ లుక్ ను చూసి నందమూరి అభిమానులకు ఎనలేని ఆనందం కలుగుతోంది. కొడుకును ఏమాత్రం వదిలి ఉండలేక పోతున్న జూనియర్ తన కొడుకును ఇలా షూటింగ్ స్పాట్ కు తీసుకు వస్తూ అభయ్ కి కూడ సినిమాల పట్ల అభిరుచి ఉండేలా జూనియర్ ఇప్పటి నుంచే తన కొడుకును తీర్చి దిద్దుతున్నాడు.

loader