Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ జయంతి సందర్భంగా బాలయ్య ఆసక్తిర కామెంట్స్!

1956 సెప్టెంబర్ 2న జన్మించిన నందమూరి హరికృష్ణ 65వ జయంతి నేడు. ఈ సందర్భంగా తమ్ముడు బాలకృష్ణ ఈ విధంగా స్పందించడం జరిగింది. 
 

ntr father harikrishna birth anniversary balarkrishna made interesting comments
Author
Hyderabad, First Published Sep 2, 2021, 10:56 AM IST


నటసింహం బాలకృష్ణ అన్నయ్య హరికృష్ణ జయంతి నాడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హరికృష్ణ పట్ల ఆయనకున్న అమితమైన ప్రేమాభిమానాలు చాటుకున్నారు.హరికృష్ణ ను దైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కొనియాడారు. 1956 సెప్టెంబర్ 2న జన్మించిన నందమూరి హరికృష్ణ 65వ జయంతి నేడు. ఈ సందర్భంగా తమ్ముడు బాలకృష్ణ ఈ విధంగా స్పందించడం జరిగింది. 

''హరన్న అంటే ధైర్యం,హరన్న అంటే ఆత్మవిశ్వాసం,హరన్న అంటే మొండితనం,హరన్న అంటే తెలుగుతనం. మా అన్న హరన్న జయంతి నేడు. ఈరోజు ఆయన మా మధ్య లేకపోయినా మా  మనసుల్లో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. మా హరన్న ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను''... అంటూ బాలకృష్ణ పేస్ బుక్ లో కామెంట్ పెట్టారు. 

2018 ఆగస్టు 29వ తేదీన హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం జరిగింది. నార్కెట్ పల్లి వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో హరికృష్ణ తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాద స్థలంలోనే హరికృష్ణ కన్నుమూసినట్లు సమాచారం. నటుడిగా పలు హిట్ చిత్రాలలో నటించిన హరికృష్ణ, తెలుగు దేశం పార్టీ స్థాపన, అధికారం చేపట్టడం వంటి కీలక ఘట్టాలో తండ్రి ఎన్టీఆర్ వెన్నంటి ఉన్నారు. తండ్రి మరణం తరువాత పార్టీలో హరికృష్ణ ప్రాబల్యం తగ్గింది. 

Follow Us:
Download App:
  • android
  • ios