ఆఫీసు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించుకోవచ్చు.!
వ్యాపారంలో రాణించాలనుకునే వారు డబ్బుపైనే కాకుండా మంచి ఆలోచనలపై కూడా దృష్టి పెట్టి పెట్టుబడి పెట్టాలి. ఇలా మంచి ఆలోచనలతో కోట్లకు పడగలెత్తిన వారు చాలా మంది ఉన్నారు.
వ్యాపారం ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా ఆలోచించేది పెట్టుబడి. పెట్టుబడి డబ్బు ఎక్కడి నుంచి రావాలి? నష్టపోతే ఏం చేయాలనే ఆలోచనలో కొందరు ఉండరు. కానీ కొంచెం ఆలోచన, మంచి తెలివితో మీరు పెట్టుబడి లేకుండా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
అలాంటి మంచి బిజినెస్ ఐడియా గురించి ఏంటి అనుకుంటున్నారా... దీని కోసం ముందుగా మీరు అన్ని మ్యారేజెస్ సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకోవాలి. ఉదాహరణకు ఫోటోగ్రాఫర్, కుకింగ్ మాస్టర్, డెకరేషన్స్, సౌండ్ సిస్టం మొదలైన సంబంధిత వారితో ఒప్పందం చేసుకోవాలి.
ఈ సర్వీసెస్ అన్ని కలిపి పెళ్లి నిర్వహించాలి. దీని ద్వారా పెళ్లి చేసుకున్న వారి తరపున కమీషన్ పొందవచ్చు. అయితే ముందుగా మీ ఆలోచనను ప్రోత్సహించడం ముఖ్యం.
ఇందుకు సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రఫీ నుండి డెకరేషన్ వరకు మీకు మీరే ఈవెంట్స్ నిర్వహించవచ్చు. దీంతో లక్షల్లో ఆదాయం వస్తుంది.