యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల అనుకున్న సమయాని కంటే,  ఏడాది వాయిదాపడినట్లు అయ్యింది. దీనితో రాజమౌళి త్వరతి గతిన షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే యోచనలో ఉన్నారు. కాగా ఎన్టీఆర్ 2019లో త్రివిక్రమ్ తో ఓ మూవీ ప్రకటించారు. 2020లో సమ్మర్ లో త్రివిక్రమ్ ఈమూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించడం జరిగింది. దీనితో 2020 జులై లో ఆర్ ఆర్ ఆర్... ఆ తరువాత నెలల వ్యవధిలో త్రివిక్రమ్ మూవీ విడుదల అవుతుందని అందరూ భావించారు. 

కోవిడ్ ఎంట్రీతో ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. నెలల తరబడి సాగిన లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనితో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ 2019, 2020లలో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్ ని వెండితెరపై చూసి రెండేళ్లు దాటిపోగా ఆర్ ఆర్ ఆర్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఐతే న్యూఇయర్ సంధర్భంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని కలిశారు. ఎన్టీఆర్ ని ఆయన నివాసంలో కలిసిన త్రివిక్రమ్ పూల గుచ్ఛం అందించిన న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. త్రివిక్రమ్ తో పాటు ఈ ప్రాజెక్ట్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఉన్నారు. దీనితో త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ షూటింగ్ డేట్ పై అప్డేట్ రానుందని ప్రచారం జరుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో పాటు ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతుంది. మరి అదే కనుక నిజం అయితే... 2021లో ఎన్టీఆర్ నుండి రెండు సినిమాలు రానున్నాయన్న మాట.